గురు వక్ర సంచారంతో ఈ 5 రాశులకు మహర్దశ.. ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేని అదృష్టం!

Updated on: Nov 14, 2026 | 10:31 PM

Jupiter Retrograde 2026 Telugu: 2026 డిసెంబర్ 13న గురు గ్రహం వక్రగమనంలోకి ప్రవేశించనుంది. 2027 జనవరి 25న తిరిగి కర్కాటక రాశిలోకి సంచరించనుంది. గురు గ్రహం ఈ మార్పు వల్ల మీనం, వృశ్చికం, కన్య, కర్కాటకం, వృషభ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో తెలుసుకుందాం.

1 / 6
Guru Vakri 2026: జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. జ్ఞానం, విద్య, సంపద, వివాహం, సంతానం, అదృష్టానికి గురువును కారకుడిగా భావిస్తారు. అందుకే గురు గ్రహం రాశి మార్పు, వక్రగమనం ప్రతి రాశిపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య నమ్మకం. ఈ నేపథ్యంలో 2026లో గురు గ్రహ వక్ర సంచారం ఆసక్తికరంగా మారనుంది. ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్న గురు గ్రహం.. డిసెంబర్ 13, 2026న వక్రగమనంలోకి ప్రవేశించనుంది. అనంతరం 2027 జనవరి 25న తిరిగి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. గురు గ్రహం ఈ విధంగా గమనాన్ని మార్చుకోవడం జ్యోతిష్య పరంగా ముఖ్యమైన పరిణామంగా పరిగణిస్తారు. ఈ మార్పు కారణంగా కొన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మీనం, వృశ్చికం, కన్య, కర్కాటకం, వృషభ రాశుల వారికి ఈ కాలం కలిసి రావచ్చు.

2 / 6
మీన రాశి: ఈ రాశి వారికి వృత్తిపరంగా మంచి రోజులు ప్రారంభం కావచ్చు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించడంతో పాటు, పై అధికారుల ప్రశంసలు అందుకోవచ్చు. పదోన్నతి, కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల సమాచారం అందవచ్చు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

3 / 6
వృశ్చిక రాశి: గురు వక్ర సంచారం ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో పురోగతిని అందించవచ్చు. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభించవచ్చు. వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు, క్లయింట్లు పరిచయం కావచ్చు. ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం.

4 / 6
కన్య రాశి: ఈ రాశి వారికి అదృష్టం కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి మంచి అవకాశాలు దక్కవచ్చు. కొత్త బాధ్యతలు చేపట్టడంతో పాటు, వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తారు. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

5 / 6
కర్కాటక రాశి: గురు గ్రహం తిరిగి ఈ రాశిలోకి ప్రవేశించడం వల్ల వ్యక్తిగత, ఆర్థిక జీవితాల్లో సానుకూల మార్పులు రావచ్చు. పెండింగ్‌లో ఉన్న ఒప్పందాలు పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యాపార సమస్యలు తొలగి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో చాలాకాలంగా కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమై ప్రశాంతత నెలకొనవచ్చు.

6 / 6
వృషభ రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. చాలాకాలంగా రావాల్సిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో కష్టానికి తగిన గుర్తింపు లభించవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు రావచ్చు. వ్యాపారవేత్తలు కొత్త ప్రాజెక్టులు చేపట్టి ఆదాయాన్ని పెంచుకోవచ్చు. కుటుంబ సంబంధాలు మెరుగుపడటంతో పాటు పొదుపుపై దృష్టి పెడతారు. (Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న ఫలితాలు జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇవి వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. వీటిని నిర్ధారిత భవిష్యవాణిగా భావించకూడదు.)

Loading...
Unable to load recommendations.
Follow Us