Astrology: గురు మంగళ యోగం ఎఫెక్ట్.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదట! మీ రాశి ఇదేనా?

Updated on: Sep 16, 2026 | 8:20 PM

Guru Mangal Yog 2026 Telugu: 2026లో గురు మంగళ యోగం ఏర్పడనుంది. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 31 వరకు గురు, కుజులు కర్కాటక రాశిలో సంచరించనున్నారు. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం ఈ కాలంలో 3 రాశులకు ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సానుకూల మార్పులు కనిపించవచ్చు.

1 / 5
Guru Mangal Yog 2026 Telugu: నవగ్రహాల్లో కుజుడిని శక్తి, ధైర్యం, పట్టుదలకు ప్రతీకగా జ్యోతిష్య శాస్త్రంలో పరిగణిస్తారు. 2026 సెప్టెంబర్ 18న కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి నవంబర్ 12 వరకు అక్కడే సంచరిస్తాడు. ఇదే సమయంలో గురుడు కూడా కర్కాటక రాశిలో సంచరిస్తుండటంతో ఈ రెండు గ్రహాల కలయికకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. జ్యోతిష్య ప్రకారం ఈ కలయికను గురు మంగళ యోగంగా పిలుస్తారు.

2 / 5
గురుడు జూన్ 2 నుంచి అక్టోబర్ 31, 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. దీంతో సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 31 వరకు గురు, కుజులు ఒకే రాశిలో ఉండనున్నారు. ఈ గ్రహ సంయోగం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆర్థిక విషయాలు, వృత్తి తదితర అంశాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకోవచ్చని జ్యోతిష్య నమ్మకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ కాలం ప్రత్యేకంగా ఉండవచ్చని భావిస్తున్నారు.

3 / 5
మేష రాశి.. ఈ రాశి వారికి కుజుడి సంచారం కుటుంబం, ఇల్లు, ఆస్తికి సంబంధించిన విషయాల్లో ప్రభావం చూపవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అవకాశాలు లభించవచ్చు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా పురోగతికి మార్గాలు కనిపించవచ్చు. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సమయంలో మాత్రం జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశాలు పెరగవచ్చు. ఉద్యోగులు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు పొందవచ్చు.

4 / 5
కర్కాటక రాశి.. గురుడు ఇప్పటికే కర్కాటక రాశిలో ఉండగా సెప్టెంబర్ 18 నుంచి కుజుడు కూడా అక్కడికి చేరనున్నాడు. దీంతో ఈ రాశివారికి ఈ గ్రహ కలయిక ప్రత్యేకంగా ఉండవచ్చని జ్యోతిష్య నమ్మకం. చాలాకాలంగా వాయిదా పడిన పనులు మళ్లీ వేగం పుంజుకోవచ్చు. వ్యాపారులకు కొత్త అవకాశాలు, ఉద్యోగులకు కీలక బాధ్యతలు లభించవచ్చు. ఆర్థికంగా కూడా ఆశించిన పురోగతి కనిపించే అవకాశం ఉంది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడి, సంబంధాల్లో సామరస్యం పెరగవచ్చు. చాలాకాలంగా కొనసాగుతున్న ముఖ్యమైన పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది.

5 / 5
వృశ్చిక రాశి.. గురు మంగళ యోగం వృశ్చిక రాశి వారికి వృత్తి, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలను తీసుకురావచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుజుడి ప్రభావంతో ఉత్సాహం, చురుకుదనం పెరగవచ్చు. కొత్త కాంట్రాక్టులు, ప్రాజెక్టులు లేదా వృత్తిపరమైన అవకాశాలు లభించవచ్చు. అదనపు ఆదాయానికి మార్గాలు కనిపించే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో మాత్రం పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి తమ నైపుణ్యాలకు తగిన అవకాశాలు రావచ్చు. కుటుంబ జీవితం కూడా సంతోషంగా సాగవచ్చని జ్యోతిష్య నమ్మకాలు సూచిస్తున్నాయి.

(Disclaimer: ఈ కథనంలోని వివరాలు జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా చెప్పబడిన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతక పరిస్థితులు, గ్రహస్థితులను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

వృశ్చిక రాశి.. గురు మంగళ యోగం వృశ్చిక రాశి వారికి వృత్తి, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలను తీసుకురావచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుజుడి ప్రభావంతో ఉత్సాహం, చురుకుదనం పెరగవచ్చు. కొత్త కాంట్రాక్టులు, ప్రాజెక్టులు లేదా వృత్తిపరమైన అవకాశాలు లభించవచ్చు. అదనపు ఆదాయానికి మార్గాలు కనిపించే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో మాత్రం పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి తమ నైపుణ్యాలకు తగిన అవకాశాలు రావచ్చు. కుటుంబ జీవితం కూడా సంతోషంగా సాగవచ్చని జ్యోతిష్య నమ్మకాలు సూచిస్తున్నాయి. (Disclaimer: ఈ కథనంలోని వివరాలు జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా చెప్పబడిన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతక పరిస్థితులు, గ్రహస్థితులను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Loading...
Unable to load recommendations.
Follow Us