
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారాలు మానవ జీవితంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. ప్రస్తుతం దేవగురువైన బృహస్పతి (గురుడు) తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలో సంచరిస్తుండగా, జూలై 16న సూర్యుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో కర్కాటక రాశిలో సూర్యుడు-గురుడి కలయికతో శుభప్రదమైన 'గురు ఆదిత్య రాజయోగం' ఏర్పడనుంది. ఈ రాజయోగం జూలై 16 నుంచి ఆగస్టు 17 వరకు కొనసాగుతుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత కర్కాటక రాశిలో ఏర్పడుతున్న ఈ యోగం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపనుంది. అయితే మరీ ముఖ్యంగా ఆరు రాశుల వారికి ధనలాభం, కెరీర్‌లో పురోగతి, గౌరవం పెరగడం వంటి శుభ ఫలితాలు లభించే అవకాశం ఉంది.

మేష రాశి: గురు ఆదిత్య రాజయోగం నాలుగో స్థానంలో ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభాలకు అవకాశముంది. పాత అప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాల్లో విజయాలు లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం కూడా ఆనందంగా సాగుతుంది.

మిథున రాశి: ధనస్థానంలో ఈ యోగం ఏర్పడటంతో ఆదాయం పెరిగే అవకాశముంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడటం జరుగుతుంది. అలాగే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి జీవితంలో పురోగతి కనిపించవచ్చు. ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది.

సింహ రాశి: ఊహించని ధనలాభాలు ఆర్జిస్తారు. పాత బకాయిలు తిరిగి రావడం జరుగుతుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశముంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశాలు కూడా దక్కవచ్చు.

కన్యా రాశి: లాభస్థానంలో గురు ఆదిత్య రాజయోగం ఏర్పడటం వల్ల కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. రీర్‌లో మంచి అవకాశాలు వస్తాయి. ఆరోగ్యపరంగానూ ఉపశమనం పొందే సూచనలు ఉన్నాయి.

తులా రాశి: కెరీర్ స్థానంలో ఏర్పడే ఈ యోగం ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలను అందిస్తుంది. ఆదాయం పెరగడం, ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం, చేపట్టిన పనులు విజయవంతం కావడం వంటి శుభ ఫలితాలకు అవకాశముంది.

ధనుస్సు రాశి: నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం జరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత, ఆదాయ వనరులు పెరగడం జరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొనడం వంటి శుభఫలితాలకు అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశముంది. (గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అంశాలు జ్యోతిష్య విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించాలి)