
అయితే చాలా మందికి ఈ సంవత్సరం 206లో వినాయక చవితి పండుగ ఎప్పుడు అనేదానిపై సరైన క్లారిటీ లేదు. కాగా, ఇప్పుడు మనం వినాయక చవితి పండుగ ఎప్పుడు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.

2026లో వినాయక చవితి సెప్టెంబర్ 14న వస్తుంది. ఇక తిథి సమయాల విషయానికి వస్తే, చవితి తిథి ప్రారంభం సెప్టెంబర్ 14 ఉదయం 7:06 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 15 ఉదయం 7:44 గంటలకు ముగుస్తుంది. ఇక వినాయకుడిని ప్రతిష్టించడానికి చాలా శుభప్రదమైన ముహూర్తం వచ్చేసి, ఉదయం 11:02 గంటల నుంచి మధ్యాహ్నం 1:31 గంటలకు వరకు చాలా అద్భుతమైన ముహూర్తం అని చెబుతున్నారు పండితులు.

ఈ సమయంలో వినాయకుడిని ప్రతిష్టించుకోవాలంట. పురాణాల ప్రకారం, వినాయకుడు మధ్యాహ్న కాలంలో జన్మించాడని చెబుతారు కాబట్టి, ఈ సమయంలో స్వామి వారికి పూజ చేయడం అత్యంత శుభప్రదం అంట. అదే విధంగా వినాయక చవితి సెప్టెంబర్ 14 రోజున ఉదయం 9 :01 గంటల నుంచి రాత్రి 8:09 గంటల వరకు చంద్రుడిని చూడకూడదంట. ఈ సమయంలో చంద్రుడిని చూడటం వలన మిథ్యా దోషం వస్తుంది అంటారు. ఈ సమయంలో చంద్రుడిని చూడటం వలన అపనిందలు మోయాల్సి వస్తుందంట.

అలాగే, వినాయకుడిని పది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాత సెప్టెంబర్ 25 శుక్రవారం రోజున వినాయకుడి నిమజ్జనం ఉంటుంది. ఈ రోజుతో వినాయక చవితి పండుగ పూర్తి అవుతుంది. ఇక ఈ పది రోజులు కూడా ఉదయం , సాయంత్రం స్నానం ఆచరించి, వినాయకుడిని పూజిస్తూ ఉండాలి. దీని వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు