
న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీని ఉపయోగించి ఆవ్యక్తి లక్కీ నెంబర్ తెలుసుకోవచ్చును. ఈ లక్కీ నెంబర్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుది. అంతే కాకుండా ఇది జీవితంలోని అనేక అంశాలపై ప్రభావం చూపుతుంది. దీనిని తెలుసుకోవడం వలన కొందరిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అందుకే చాలా మంది తమ లక్కీ నెంబర్ తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

ఇక న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ, అతను పుట్టిన తేదీ, నెల, సంవత్సరంలోని అంకెలను ఒకే సంఖ్యగా కలిపితే అదృష్ట సంఖ్య వస్తుంది. కొన్ని సార్లు ఇదే మీ జీవితాన్ని మలుపు తిప్పడమే కాకుండా మీకు అదృష్టాన్ని కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతే కాకుండా దీనిని తెలుసుకోవడం వలన కొన్ని సార్లు మీ అదృష్ట సంఖ్యకు ఉన్న శక్తితో మీరు కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని జీవితంలో ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

అయితే ఇప్పుడు పుట్టిన తేదీని బట్టి అదృష్ట సంఖ్య ఎలా తెలుసుకోవాలో చూసేద్దాం.. ఒక వేళ మీరు 2-12-1997లో గనుక జన్మించినట్లు అయితే. 2+1+2+1+9+9+7=31= 3+1=4 అంటే ఈ తేదీలో జన్మించిన వ్యక్తుల అదృష్ట సంఖ్య 4. ఈలక్కీ నెంబర్ అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.

అంతే కాకుండా ఈ అదృష్ట సంఖ్యలు చాలా మందికి అదృష్టాన్ని తీసుకొస్తాయని సంఖ్యాశాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అంతే కాకుండా ఇవి మానసికంగా, ఆర్థికంగా, అభివృద్ధి పరంగా, వివాహం, ప్రేమ ఇలా అన్ని విషయాల్లో మీకు బలాన్ని ఇవ్వడమే కాకుండా శ్రేయస్సును కూడా తీసుకొస్తాయంట.

అయితే కొంత మందికి పుట్టిన తేదీ తెలియదు. మరి వారు ఎలా తమ లక్కీనెంబర్ తెలుసుకోవాలి అనిఅనుకుంటారు. అయితే పుట్టిన తేదీ లేకపోతే వారి పేరును బట్టి కూడా అదృష్ట సంఖ్యను తెలుసుకోవచ్చునంట. అది ఎలా అంటే? a,i,j,y,q= 1 b,k,r=2 cgls=3 dmt=4 ehnx=5 uvw=6 oz=7 fp=8. మీ పేరు లక్ష్మణ రావు అయితే 3+1+2+3+5+4+1+5+1+2+1+7=35=3+5=8 ..8అదృష్ట సంఖ్య.