
చాల్టియన్ సంఖ్యా శాస్త్రం ప్రకారం, ఎవరి పేరు అయితే ఎఫ్ అనే అక్షరంతో ప్రారంభం అవుతుందో వారి అదృష్ట సంఖ్య 8. అంతే కాకుండా వీరికి అధిపతి శని, వీరు పూర్వాషాఢ నక్షత్రానికి చెందిన వారు. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు, ఇది ధనస్సు రాశికి చెందినది. అలాగే ధనస్సు రాశి అధిపతి గురు. అంటే ఈ 8వ సంఖ్యపై గురు, శుక్ర, శని గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని వలన వీరి జీవితంలో అనేక మార్పులు ఉంటాయి. ముఖ్యంగా చాలా వరకు వీరు అద్భుతమైన జీవితాన్ని గడుపుతారు.

ఎవరి పేరు అయితే ఎఫ్ అనే అక్షరంతో ప్రారంభం అవుతుందో వారు మంచి వివేకమైన గుణం కలిగి ఉంటారు. మంచి జ్ఞానం ఉంటుంది. అంతే కాకుండా కష్టపడి పని చేసే తత్వం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఆధ్యాత్మిక పరమైన భావన ఎక్కువగా ఉంటుంది. వీరు ఇతరులను అర్థం చేసుకోవడంలో కూడా చాలా ముందు ఉంటారు.

అంతే కాకుండా ఈ ఎఫ్ అనే అక్షరంతో పేరు మొదలు అయ్యే వారు మంచి ఆకర్షణీయంగా ఉంటారు. ఇతరులను చాలా సులభంగా ఆకట్టుకుంటారు. అంతే కాకుండా మంచి, చెడులపై మంచి స్పష్టత ఉంటుంది. ఎక్కువగా వీరు బ్యాంకింగ్ రంగాల్లో స్థిరపడతారు. కెరీర్ పై మంచి స్పష్టత ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా సరే మనసులో దాచుకొని, తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. కుటుంబపై అమితమైన ఇష్టం ఉంటుంది. అలాగే వీరు జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటారు. అన్నింట్లో మంచి విజయం అందుకుంటారు.

అదే విధంగా ఈ ఎఫ్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ప్రేమపై మంచి అభిప్రాయం కలిగి ఉంటారు. తమ భాగస్వామిని బాగా చూసుకుంటారు. అంతే కాకుండా వీరు ఎక్కువగా నమ్మకం ఆధారంగా ప్రేమను కోరుకుంటారు. ప్రేమలో చాలా నిబద్ధతగా ఉంటారు. అలాగే తన భాగస్వామికి ఎప్పుడూ అండగా ఉంటారు. వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. వీరికి ప్రేమ, భద్రత, వైవాహిక జీవితంలో నిజాయితీ ఎక్కువగా ఉంటుంది.

ముఖ్య గమనిక : ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది