
డిసెంబర్ నెలలో అనేక గ్రహాలు సంచారం చేయనున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 2న బుధ సంచారం జరగనుంది. దీని తర్వాత కూడా సూర్యుడు, రాహు ఇలా అనేక గ్రహాలు రాశి సంచారం, నక్షత్ర సంచారం చేయనున్నాయి. మరికొన్ని గ్రహాలు కదలికలు జరపనున్నాయి. దీని వలన డిసెంబర్ నెల మొత్తం నాలుగు రాశుల వారికి అద్భుతంగా కలిసి వస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

తుల రాశి : ఎప్పటినుండో ఎదురుచూస్తున్న శుభవార్త ఈ నెలలో వింటారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఆఫర్ వస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ప్రేమ, పెళ్లి విషయంలో కూడా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా చాలా బలపడతారు.

ధనస్సు రాశి :ఈ డిసెంబర్ మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే నెల. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. కొత్త ఇల్లు, కొత్త వాహనం కొనే యోగం ఉంది. కుటుంబంలో ఆనందం, ప్రశాంతత పెరుగుతుంది. లాటరీ, ఆకస్మిక ధనలాభం కూడా కలిసివచ్చే అవకాశం ఉంది

వృశ్చిక రాశి :మీ కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు దక్కుతుంది. అప్పులు తీరిపోయి, చేతిలో డబ్బు నిలబడుతుంది. ఉన్నతాధికారుల మెప్పు పొంది, ఉద్యోగంలో ముందుకు వెళ్తారు. ఆస్తి విషయంలో, కోర్టు కేసుల విషయంలో కూడా మీకే అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది.

కుంభ రాశి : ఈ నెల మీకు అన్ని విధాలా కలిసివచ్చే నెల. ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరిగే ఛాన్స్ ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త డీల్స్ వస్తాయి. ఇంట్లో శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి.