
2026 సంవత్సరపు చివరి నెల డిసెంబరులో గ్రహాల రాశి మార్పులు, కదలికలు జ్యోతిషశాస్త్ర పరంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. బుధుడు, రాహువు, కేతువు, శని, గురు, సూర్యుడు వంటి ప్రధాన గ్రహాల సంచారాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ గ్రహాల ప్రభావం 12 రాశుల వారి జీవితాలపై ఉంటుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి డిసెంబర్ నెల అత్యంత అనుకూలంగా ఉండబోతోందని జ్యోతిష అంచనాలు సూచిస్తున్నాయి. ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం వంటి విషయాల్లో సానుకూల ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు గతంలో ఎదురైన కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులేమిటో తెలుసుకుందాం.

1. మిథున రాశి: ఈ రాశి వారికి డిసెంబర్ నెల అనుకూలంగా ఉండే అవకాశముంది. ఈ సమయంలో శత్రువులపై ఆధిపత్యం సాధించే అవకాశం ఉంది. ప్రత్యర్థులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చివరికి విజయం మీదే అవుతుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అవసరమైన విషయాలు సమయానికి సమకూరుతాయి.

2. తులా రాశి: ఈ రాశి వారికి డిసెంబర్ నెలలో అదృష్టం కలిసి వస్తుంది. ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో సహకారం లభించే అవకాశం ఉంది. అధికార వర్గాల నుంచి మద్దతు పొందుతారు. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలు అందుకునే సూచనలు ఉన్నాయి. ఖర్చులు తగ్గి కుటుంబ సంతోషం పెరుగుతుంది. ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు పెరిగి చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.

3. వృశ్చిక రాశి: ఈ రాశి వారు డిసెంబర్ నెలలో అనుకూల ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల్లో మంచి విజయాలు సాధిస్తారు. గతంలో ఎక్కడైనా డబ్బు నిలిచిపోయి ఉంటే తిరిగి చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులకు అనుకూలమైన అవకాశాలు లభిస్తాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి రాబడులు పొందే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటే ప్రయోజనం పొందుతారు.

4. కుంభ రాశి: ఈ రాశి వారికి డిసెంబర్ నెల ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి విజయాలు సాధిస్తారు. కొత్త ఒప్పందాలు, డీల్స్ కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ప్రభుత్వ ఖర్చులతో ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతారు. (గమనిక: ఈ వివరాలు జ్యోతిషశాస్త్ర విశ్వాసాలు, అంచనాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిని కచ్చితమైన భవిష్యత్ ఫలితాలుగా భావించకూడదు)