
గొప్ప ఆలోచనాపరుడు, దౌత్యవేత్త అయిన ఆచార్య చాణక్యుడు రచించిన చాణక్యనీతి పుస్తకంలో మానవ జీవితానికి సంబంధించిన దాదాపు అన్ని అంశాలపై అమూల్యమైన సూచనలు ఉన్నాయి. వ్యక్తి నుంచి కుటుంబం వరకు, కుటుంబం నుంచి దేశం వరకు ఎదుగుదలకు అవసరమైన మార్గదర్శకాలను ఆయన స్పష్టంగా వివరించారు. చాణక్యుడి అభిప్రాయం ప్రకారం, యువతే ఏ దేశానికైనా అసలైన సంపద. ఒక దేశంలో యువ జనాభా ఎక్కువగా ఉంటే ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందగలదు. అయితే అది కేవలం సంఖ్యల వల్ల కాదు.. ఆ యువత సరైన విలువలతో పెరిగి, కష్టపడి పనిచేసే స్వభావం కలిగి, మంచి విద్యతో శక్తివంతంగా మారినప్పుడే సాధ్యం. సరైన మార్గదర్శకత్వం, విలువలు, శిక్షణ లేకపోతే యువ శక్తి దారి తప్పే అవకాశమూ ఉంటుంది.

డబ్బును దానం చేయడం : డబ్బును దానం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీరు అందరికీ సహాయం చేస్తారు. కానీ, మీ అవసరాల్లో ఎవరు ఆదుకోరు. లేదంటే, మీ డబ్బు మొత్తం వృధా అవుతుంది

పని విషయంలో ప్రణాళిక లేకపోవడం: ఎలాంటి లక్ష్యాలు లేకుండా, డబ్బును విపరీతంగా ఖర్చు చేస్తారు. కొందరు డబ్బును ఇన్వెస్ట్ చేసి ఉన్న డబ్బు మొత్తాన్ని నష్టపోతారు.

తెలియని వాళ్ళకి అప్పు ఇవ్వడం: పరిచయం లేని వాళ్ళకి డబ్బు ఇచ్చి మోసపోకండి. ఎందుకంటే, డబ్బు విషయంలో ప్రతి ఒక్కరూ కూడా స్వార్థంగా ఆలోచిస్తారు. మీరు అవసరానికి ఇచ్చిన అది తిరిగి రాకపోతే చాలా దెబ్బతింటారు.

తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించడం : కొందరు అక్రమంగా దొంగదారిలో డబ్బు సంపాదిస్తారు. ఇది వారికి ఆ క్షణాన మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది. ఆ తర్వాత లేని పోనీ సమస్యలను తెచ్చి పెడుతుంది.

అవసరానికి మించిన ఖర్చులు: డబ్బు ఉంది కదా అని అవసరానికి మించి విచ్చల విడిగా డబ్బును ఖర్చు చేస్తే ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. వచ్చే డబ్బును చూసి ఖర్చులు పెంచుకోవడం చాలా పెద్ద తప్పు అని చాణుక్యుడు చెబుతున్నాడు.

సారాంశంగా చెప్పాలంటే, ఒక దేశం బలంగా ఉండాలంటే యువత బలంగా ఉండాలి; యువత బలంగా ఉండాలంటే బాల్యం నుంచే సరైన విలువలు, విద్య, క్రమశిక్షణ, మంచి మార్గదర్శకత్వం అవసరం. తల్లిదండ్రులు ఈ విషయాలను గమనించి తమ పిల్లలను పెంచితే వారు భవిష్యత్తులో విజయవంతులై కుటుంబానికి, సమాజానికి, దేశానికి గౌరవం తీసుకురాగలరు.