Chanakya Niti: గాడిదే అని చిన్న చూపు వద్దు.. దీని నుంచి ఈ లక్షణాలు నేర్చుకున్న మనిషికి అపజయం అన్న మాటే ఉండదు..

Updated on: Sep 15, 2025 | 10:54 AM

చాణక్యుని నీతి శతాబ్దాలుగా నాయకత్వం, విజయం, జీవిత నిర్వహణకు సంబంధించిన ఉత్తమ సూత్రాలను అందిస్తోంది. చాణక్య ఆలోచనలు రాజకీయ వ్యూహానికే పరిమితం కాకుండా రోజువారీ జీవితంలో విజయానికి కూడా కీలకం. చాణక్యుడు మనుషులు ప్రకృతి నుంచి , జంతువులు, పక్షుల నుంచి కూడా నేర్చుకోవాల్సిన అనేక విషయాలు ఉన్నాయని చెప్పాడు. అందులో మనిషి గాడిదకు ఉన్న కొన్ని లక్షణాలను నేర్చుకోవాలని చెప్పాడు. వాటిని స్వీకరించడం వల్ల జీవితంలో పెద్ద మార్పు వస్తుందని అన్నాడు. ఈ అలవాట్లు సరళంగా కనిపిస్తాయి. అయితే అవి కెరీర్, వ్యక్తిత్వం, నైతికతపై ప్రభావాన్ని చూపిస్తాయి.

1 / 5
రాజకీయ, తత్వవేత్త, జీవిత మార్గదర్శిగా పేరుగాంచిన ఆచార్య చాణక్యుడు జీవితంలో విజయం సాధించడానికి అనేక అమూల్యమైన సూత్రాలను అందించాడు. చాణక్యుడు రచించిన నీతి శాస్త్రంలో గాడిదకు సంబంధించిన మూడు ప్రత్యేక అలవాట్లను ప్రస్తావిస్తుంది. వీటిని స్వీకరించడం ద్వారా ఏ వ్యక్తి అయినా తన జీవితంలో స్థిరత్వం, సంతృప్తి, విజయాన్ని సాధించవచ్చు. మానవులు ప్రతి ఒక్కరి నుంచి అది వ్యక్తి అయినా లేదా జంతువు అయినా, ఏదో ఒకటి నేర్చుకోగలరని చాణక్యుడు నమ్మాడు. గాడిదను చాలా మంది సోమరిగా భావిస్తారు. అయితే గాడిదకు ఉన్న లక్షణాల్లో మూడు లక్షణాలు నేటికీ మనిషికి ప్రేరణగా నిలుస్తాయి.

2 / 5

లక్ష్యం పట్ల నిబద్ధత.
గాడిదకు తన పని పట్ల అంకితభావం ఎక్కువ. ఈ అంకితభావం ద్వారా చాణక్యుడు మానవులకు జీవితంలో లక్ష్యానికి కట్టుబడి ఉండటం ఎంత ముఖ్యమో సందేశాన్ని ఇచ్చాడు. పరిస్థితులు కష్టంగా ఉన్నా లేదా ప్రజలు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించినా.. మీరు మీ లక్ష్యం సాధించే దిశగా పనిచేస్తూ ఉంటే.. విజయం ఖచ్చితంగా లభిస్తుంది. సోమరితనం, భయం మీ దారిలోకి రానివ్వకండి.

లక్ష్యం పట్ల నిబద్ధత. గాడిదకు తన పని పట్ల అంకితభావం ఎక్కువ. ఈ అంకితభావం ద్వారా చాణక్యుడు మానవులకు జీవితంలో లక్ష్యానికి కట్టుబడి ఉండటం ఎంత ముఖ్యమో సందేశాన్ని ఇచ్చాడు. పరిస్థితులు కష్టంగా ఉన్నా లేదా ప్రజలు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించినా.. మీరు మీ లక్ష్యం సాధించే దిశగా పనిచేస్తూ ఉంటే.. విజయం ఖచ్చితంగా లభిస్తుంది. సోమరితనం, భయం మీ దారిలోకి రానివ్వకండి.

3 / 5
సంతృప్తి, సహనం
గాడిదకు ఏది దొరికినా.. దానిని సంతృప్తితో స్వీకరిస్తుంది. సంతృప్తి, ఓర్పు మాత్రమే ఒక వ్యక్తిని మానసికంగా బలంగా చేస్తాయని చాణక్యుడు చెప్పాడు. ఫలితం గురించి చింతించకుండా కష్టపడి పనిచేయండి, ఇదే విజయానికి కీలకం. జీవితంలో సంతృప్తి చెందిన వ్యక్తి క్లిష్ట పరిస్థితుల్లో కూడా స్థిరంగా ఉంటాడు. చిన్న ప్రయత్నాలను చేయడం ద్వారా పెద్ద ఫలితాలను సాధించగలడు.

సంతృప్తి, సహనం గాడిదకు ఏది దొరికినా.. దానిని సంతృప్తితో స్వీకరిస్తుంది. సంతృప్తి, ఓర్పు మాత్రమే ఒక వ్యక్తిని మానసికంగా బలంగా చేస్తాయని చాణక్యుడు చెప్పాడు. ఫలితం గురించి చింతించకుండా కష్టపడి పనిచేయండి, ఇదే విజయానికి కీలకం. జీవితంలో సంతృప్తి చెందిన వ్యక్తి క్లిష్ట పరిస్థితుల్లో కూడా స్థిరంగా ఉంటాడు. చిన్న ప్రయత్నాలను చేయడం ద్వారా పెద్ద ఫలితాలను సాధించగలడు.

4 / 5
కృషి, స్థిరత్వం
గాడిద సోమరితనం లేకుండా నిరంతరం పనిచేస్తుంది. మానవులు కూడా సోమరితనం వదిలి నిరంతరం కష్టపడి పనిచేయాలని చాణక్యుడు చెప్పాడు. చిన్న ప్రయత్నాలు కూడా కాలక్రమేణా పెద్ద ఫలితాలను ఇచ్చేవిగా మారుతాయి. నిరంతరం కష్టపడి పనిచేసే వ్యక్తి చివరికి విజయం సాధిస్తాడు.

కృషి, స్థిరత్వం గాడిద సోమరితనం లేకుండా నిరంతరం పనిచేస్తుంది. మానవులు కూడా సోమరితనం వదిలి నిరంతరం కష్టపడి పనిచేయాలని చాణక్యుడు చెప్పాడు. చిన్న ప్రయత్నాలు కూడా కాలక్రమేణా పెద్ద ఫలితాలను ఇచ్చేవిగా మారుతాయి. నిరంతరం కష్టపడి పనిచేసే వ్యక్తి చివరికి విజయం సాధిస్తాడు.

5 / 5
లక్ష్యానికి నిబద్ధత, సంతృప్తి, ఓర్పు, నిరంతర కృషి అనే ఈ మూడు అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా ఏ వ్యక్తి అయినా తన జీవితంలో మార్పు తీసుకురావచ్చు. చాణక్యుడి ఈ విధానం అతని కాలంలో ఎంత సందర్భోచితంగా ఉందో నేటికీ అంతే సందర్భోచితంగా ఉంది. గాడిద నుంచి ఈ ప్రభావవంతమైన లక్షణాలను నేర్చుకున్న మనిషి జీవితం విజయంలో పయనిస్తుంది.