ఈద్ స్పెషల్.. అబ్బబ్బ.. మటన్‌తో తప్పక చేసుకోవాల్సిన 5 రకాల ఫేమస్ వంటకాలు ఇవే!

Updated on: May 27, 2026 | 8:30 AM

మటన్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు.. ముఖ్యంగా ఏ పండుగ వచ్చిందంటే తప్పకుండా మటన్ కర్రీ వండాల్సిందే.. మరీ ముఖ్యంగా బక్రీద్ పండుగ రోజున రక రకాల వంటలు చేస్తుంటారు. అయితే అందులో ఏది ఉన్నా లేకపోయినా.. మటన్ మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. అయితే ఈ బక్రీద్ పండుగ మీ ఇంటిలో చాలా స్పెషల్‌గా ఉండాలి అంటే, ఈ రోజున మటన్‌తో ఈ ఐదు రకాల వంటలు తప్పక చేయాల్సిందే. మంటన్‌తో ఈ వంటకాలు ట్రై చేసి, మీ ఫ్యామిలీ, స్నేహితులకు పెట్టారంట, వారు ముక్క వదలకుండా తింటారు. మరి ఇంతకీ అవి ఏవో ఇప్పుడు చూసెయ్యండి.

1 / 5
మటన్ కీమా : చాలా మంది మటన్ ముక్కల కంటే , కీమా తినడం ఇష్టం ఉంటుంది. అంతే కాకుండా బక్రీద్ పండుగ రోజు చపాతీ లేదా పూరీల్లోకి కీమా చాలా అద్భుతంగా ఉంటుంది. అందువలన ఈ రోజు మటన్ కీమా చేసి మీ ఫ్యామిలీకి లేదా ఫ్రెండ్స్‌కు మంచి విందు ఇవ్వండి. ముఖ్యంగా మటన్ కీమా, మేక మాంసంతో చేయడం వలన చాలా మెత్తగా, రుచికరంగా ఉంటుందంట.

2 / 5
ఎప్పుడూ చేసే విధానమే కాకుండా ఈసారి బక్రీద్ పండుగకు  కాస్త డిఫరెంట్‌గా ట్రై చేయండి. కేరళ స్టైల్‌లో కొబ్బరి నూనెలో మటన్ వేయించి, కరివేపాకు , సుగంధ ద్రవ్యాలతో చాలా కొత్తగా ఉండే కేరళ స్టైల్ మటన్ ప్రిపేర్ చేయండి. ఇది మీ ఇంటికి వచ్చే చుట్టాలకు, కొత్త రుచిని పరిచయం చేసినట్లు ఉంటుంది.

3 / 5
మటన్ బిర్యానీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ఏ చిన్న పార్టీ అయినా సరే పెద్ద పండుగైనా సరే అన్ని వంటలతో పాటు తప్పకుండా మటన్ బిర్యానీ ఉండాల్సిందే. అయితే ఎప్పుడూ చేసే విధంగా కాకుండా రెస్టారెంట్ స్టైల్‌లో బిర్యానీ చేసి వడ్డించండి. ఎన్ని రకాల వంటలు ఉన్నా ప్రతి ఒక్కరూ తప్పకుండా మటన్ బిర్యానీ తింటారు. ఇక మీరు కాస్త స్పెషల్‌గా ప్రిపేర్ చేస్తే మెతుకు కూడా మిగలకుండా తింటారు

4 / 5
అదే విధంగా మటన్ అంటే రెగ్యులర్‌గా తిని బోర్ కొడుతుంది. అందువలన ఎర్ర పండు మిర్చితో మటన్ కర్రీ ప్రిపేర్ చేయండి. దీని రుచికి ఎవ్వరు అయినా ఫిదా అయిపోతారు.  ఎర్ర పండు మిర్చి, వెల్లుల్లి, లవంగాలు, వెనిగర్ పేస్ట్ వేసి, గ్రేవీలో రెడీ చేస్తే గోవా స్టైల్‌లో ఉండే ఎర్ర పండు మిర్చి మటన్ కర్రీ రెడీ అవుతుంది.

5 / 5
మటన్ కర్రీ.. బక్రీద్ రోజు మటన్ కర్రీ కూడా మర్చిపోకండి. కొంత మంది రెగ్యూలర్‌గా తిన్నా కూడా మటన్ కర్రీని ఇష్టంగా తింటారు. ఇంకొంత మందికి ఎన్ని రకాల వంటకాలు ఉన్నా మటన్ కర్రీ మాత్రం కావాల్సిందే అంటారు. అందువలన కాస్త డిఫరెంట్‌గా సుగంధ ద్రవ్యాలు, కొబ్బరి పొడి, ఘరం మసాలా వేసి , మటన్ కర్రీ కాస్త ఘాటుగా టేస్టీగా వండి పెట్టండి. దీంతో ఈ సారి బక్రీద్ మీ ఇంట్లో చాలా స్పెషల్ అవుతుంది

Follow Us