
మేష రాశి : మేష రాశి వారికి ఇది చాలా మంచి సమయం. సూర్యుడు, శుక్ర గ్రహాల వలన ఈ రాశుల వారికి త్వరలో అప్పులు తీరిపోతాయి. అంతే కాకుండా ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి నష్టాలు చవి చూసిన వ్యాపారస్తులు కూడా ఈ సమయంలో ఎక్కువ మొత్తంలో లాభాలను అందుకుంటారు.

తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం. ఈ రాశి వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థికంగా చాలా వరకు ఇది కలిసి వచ్చే సమయం. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు సంపదను తీసుకొస్తాయి. ఉన్న ఫలంగా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ కూడా ఉన్నదంట.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆదాయం డబుల్ అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే సొంత వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి ఇది చాలా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవాలి. అన్ని విధాలుగా వీరికి ఇది అద్భుతమైన సమయం.

మకర రాశి : మకర రాశి వారికి శుక్రాధిత్య రాజయోగం వస్తూ వస్తూనే వరాలను తీసుకొస్తుంది. అప్పుల బాధలతో సతమతం అయ్యేవారికి ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవాలి. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా డబుల్ అవుతుంది. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా మంచి సమయం. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు