Ashtavinayak Yatra: మహారాష్ట్రలో అష్టవినాయక క్షేత్రాలు.. ఇక్కడ ఆలయంలో 100 ఏళ్లుగా వెలుగుతున్న అఖండద్వీపం..

|

Sep 06, 2021 | 9:02 PM

Ashtavinayak Yatra: వినాయకుడు హిందువులకు.. ముఖ్యంగా మహారాష్ట్రలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు. దీంతో మహారాష్ట్రలో హిందువులు అష్టవినాయక యాత్రను చేస్తారు. ఇక్కడ అష్టవినాయక క్షేత్రాలను ఒక వరుసలో దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మొత్తం ప్రయాణం 654 కి.మీ ప్రయాణించాల్సి ఉంటుంది. ఇప్పుడు అష్టవినాయక క్షేత్రాల గురించి తెలుసుకుందాం..

1 / 8
 సిద్ధి, బుద్ధి సమేతంగా పద్మంలో కొలువైన రంజన్‌గావ్‌ వినాయకుడు మహాగణపతి.  శివుడు విఘ్నాధిపతి అయిన తన కుమారుణ్ని ఆవాహన చేసిన అనంతరం త్రిపురాసురుణ్ని సంహరించాడని భక్తుల నమ్మకం. తన విజయానికి కారణమైన వినాయకుడి విగ్రహాన్ని శంకరుడే స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించాడని గణేశపురాణం చెబుతోంది. ఇక్కడ వినాయకుడి విగ్రహానికి పది తొండాలు, ఇరవై చేతులు ఉన్నాయి.

2 / 8
పూణే నుండి 95 కిలోమీటర్ల దూరంలో, పూనే-నాసిక్ హైవే వెళ్తున్న దారిలో ఓజార్ పట్టణంలో కుకాడి నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం అన్ని వైపులా ఎత్తైన రాతి గోడలతో కప్పబడి ఉంటుంది. శిఖరం బంగారంతో ఉంటుంది. విగ్రహం తూర్పు ముఖంగా ఉంది భక్తులతో పూజలను అందుకుంటుంది.

3 / 8
పూణే నుండి 97 కిమీ దూరంలో ఉన్న గిరిజాత్మ దేవాలయ దర్శనం కొంచెం కష్టం.. ఈ దేవాలయం బౌద్ధ గుహల లోపల పర్వతంపై ఉంది. ఈ గుహలను గణేష్ గుహలు అని కూడా అంటారు. ఎత్తైన కొండమీద ఒక గుహలో కొలువై  ఉన్న గిరిజాత్మజుడిని దర్శించుకోవాలంటే 307 మెట్లు ఎక్కాల్సి ఉంది. పిల్లలూ, వయసులో ఉన్నవారూ చురుగ్గా ఎక్కొచ్చుగానీ.. పెద్దవాళ్లకు కష్టమే. అలాంటివారి కోసం డోలీ ఏర్పాట్లు కూడా ఉన్నాయక్కడ. ఇక్కడ ఉన్న విగ్రహం ప్రత్యేక విగ్రహం కాదు.. గుహ యొక్క రాతి గోడపై చెక్కబడింది. విగ్రహం యొక్క ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది. హెచ్చుతగ్గులతో చిత్రంగా ఉంటుందిక్కడి విగ్రహన్ని గిరిజాత్మజుడంటారు. గిరిజాత్మజుడంటే పార్వతీదేవి కుమారుడు అని అర్ధం

4 / 8
షోలాపూర్‌ పుణె మార్గంలో థూర్ గ్రామంలో గణేశుడు చింతామణి గణపతిగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయంలో వినాయకుడిని 'చింతామణి' అనే పేరుతో పూజిస్తారు. ఎక్కడ విగ్నేశ్వరుడిని భక్తితో కొలిస్తే.. వారిని చింతల నుండి విముక్తిని చేస్తాడని నమ్మకం

5 / 8
పూణే నుండి 146 కి.మీ దూరంలో ఉన్న క్షేత్రం మహడ్‌ గ్రామం. ఇక్కడ స్వామి వరద వినాయకుడుగా భక్తులతో పూజలను అందుకుంటున్నారు. ఇక్కడ గణేశుడు విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. తొండం ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది.  దేవాలయానికి ఆనుకుని ఉన్న సరస్సులో గణేశుడు విగ్రహం బయల్పడినట్లు స్థలపురాణం. స్వయంభువుగా వెలిసి వరద వినాయకుడిగా సుప్రసిద్ధుడయ్యాడట. ఈ స్వామివారి గర్భగుడిలోని దీపం (నందదీప్)1892 నుండి వెలుగుతూనే ఉందట.

6 / 8
పుణెకి 100 కిలో మీటర్ల దూరాన పాలి క్షేత్రంలో వెలసిన స్వామి బల్లాలేశ్వరుడు అంటే బాలగణపతిని అంటారు. బల్లాల్‌ అనే పరమ భక్తుడి భక్తికి మెచ్చి బ్రాహ్మణ రూపంలో గణపతి ప్రత్యక్షమయ్యారని భక్తుల విశ్వాసం. భక్తుడి పేరుతోనేపిలవబడే ఏకైక వినాయకుడు బల్లాలేశ్వర్. తూర్పముఖంగా వెలసిన బల్లాలేశ్వరుడి విగ్రహంపై దక్షిణాయన కాలంలో సూర్యకిరణాలు పడటం విశేషం

7 / 8
సిద్ధివినాయకుడి ఆలయం పూణే నుండి 100 కి.మీ దూరంలో ఉన్న సిద్ధాతెక్ గ్రామంలో ఉంది. ఈ గర్భగుడిని ఇండోర్‌కు చెందిన మహారాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. . వినాయకుడి వరం వలన కార్యసిద్ధి కావడంతో ఈ ప్రాంతం సిద్ధక్షేత్రం అయింది. ఈ ఆలయం ఎత్తైన కొండపై ఉంటుంది. స్వయంభువుగా భావించే గణేశుడు విగ్రహానికి ఇరువైపులా సిద్ధి, బుద్ధి దేవతలున్నారు. మిగతా క్షేత్రాల్లోని విగ్రహాలకు భిన్నంగా ఇక్కడ స్వామి వారి తొండం కుడివైపునకు తిరిగి ఉంటుంది.

8 / 8
పుణే నుండి 65 కిమీ దూరంలో కర్హా నది ఒడ్డున మోర్గావ్ గ్రామంలో వినాయక ఆలయం ఉంది. ఇక్కడ గణేశుడు మూషికవాహనంపై కాకుండా నెమలిని ఆసనంగా చేసుకుని ఉంటాడు.. అందుకనే ఈ గణేషుడిని మయూరేశ్వరుడు, మోరేష్‌, మోరేశ్వర్‌ అని పిలుస్తారు. గణేశుడి పక్కడ ఆయన భార్యలైన సిద్ధి, బుద్ధి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో వినాయక చవితితోపాటు విజయదశమి వేడుకలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.