
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోఉన్నప్పుడు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తాడంట. మానసికంగా, శారీరకంగా అన్నివిధాలుగా ప్రజలు ఆనందంగా జీవిస్తారని చెబుతున్నారు పండితులు. కాగా, ఇది పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపగా, ఏ మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

సింహ రాశి : సింహ రాశి వారికి సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయడం అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ అందుకునే ఛాన్స్ ఉంది. అలాగే ఆదాయం పెరుగుతుంది. కొత్త కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది బెస్ట్ సమయం. త్వరలో ప్రమోషన్ అందుకునే ఛాన్స్ ఉంది. అలాగే ఆదాయం రెట్టింపు అవుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరుద్ర కార్తె సమయం మొత్తం వీరు చాలా సంతోషంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. ఊహకందని విధంగా మీరు ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. ఎవరు అయితే చాలా రోజుల నుంచి అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ సమయం చాలా మంచి సమయం. ఎందుకంటే? అప్పుల బాధలు అన్నీ తీరిపోయి చాలా ఆనందంగా గడుపుతారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు