
చాలా మంది పెద్ద వారు చెబుతుంటారు, ఆడ పిల్లలు అమావాస్య రోజు, మగ పిల్లలు పౌర్ణమి రోజు జన్మించడం చాలా మంచిదంటారు. కానీ కొంత మంద మాత్రం అమావాస్య రోజున బిడ్డకు జన్మనివ్వడం మంచిది కాదు, ఈ రోజు చీకటి ఎలా ఉంటుందో, పుట్టే పిల్లల జీవితంలో కూడ అలాగే చీకటి ఉంటుందని అంటుంటారు. మరీ దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అమావాస్య అంటే, ఆ రోజు చంద్రుడు కనిపించడు. దీనిని కుహు యోగం అని అంటారు. అయితే ఈ రోజున చంద్రుడి ప్రభావం ఉండదు. అందువలన ఈ రోజున జన్మించి పిల్లలు చాలా విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉన్నదంట. ముఖ్యంగా చాలా అమాయకంగా, ఎక్కువ మానసిక ఆందోళనలతో బాధపడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట.

అంతే కాకుండా కొన్ని సార్లు అమావాస్య కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో వస్తుంది. ఒక వేళ ఇది అశుభకర తిథిలో వచ్చినప్పుడు అది పిల్లలపై చెడు ప్రభావం చూపే ఛాన్స్ ఎక్కువగా ఉన్నదంట. దీని కారణంగా పిల్లల ఆరోగ్యం లేదా తల్లి, తండ్రి, మేనమామ ఆరోగ్యంపై ఇది ప్రత్యేక్ష ప్రభావాన్ని చూపుతుందంట. అందుకే తిథి చూసుకొని దాని నివారణ చర్యలు చేపట్టడం వలన ఎలాంటి సమస్యలు తలెత్తవు.

ఇక ఈ సమయంలో జన్మించిన పిల్లలు ఎదిగే సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొటారంట. ముఖ్యమైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో తడబడటం, అనారోగ్య సమస్యలతో బాధపడతారంట. కానీ అమావాస్య రోజు మంచి తిథిలో ఆడ పిల్ల జన్మించడం వలన ఆ ఇంటిలో సిరి సంపదలు పెరుగుతాయంట. ఆ ఆడపిల్లపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుందంట.

అదే విధంగా పౌర్ణమి రోజున మగ పిల్లలు జన్మించడం చాలా మంచిదంట. వీరు చాలా ప్రకాశవంతమైన తేజస్సుతో జన్మిస్తారు. ఈ సమయంలో జన్మించిన వారు భవిష్యత్తుపై మంచి ఆలోచనతో ఉండటమే కాకుండా, కుటుంబం పట్ల దయ ప్రేమను నిండి ఉంటారంట.