కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో తెలుసా?

Updated on: Nov 11, 2026 | 12:27 PM

కార్తీక మాసం వచ్చేసింది. అత్యంత పవిత్రమైన మాసంలో కార్తీక మాసం కూడా ఒకటి. ఈ సమయంలో చాలా మంది నదీ స్నానం ఆచరించడం, నిత్యం శివుడిని ఆరాధిస్తూ పూజలు, వ్రతాలు చేయడం చేస్తుంటారు. అంతే కాకుండా ప్రతి రోజూ దీపం వెలిగిస్తుంటారు. ఇక కార్తీక మాసంలో ముఖ్యంగా ఆకాశ దీపం వెలిగిస్తారు. కాగా, ఇప్పుడు మనం అసలు ఈ మాసంలో ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు. దీని గురించి తెలుసుకుందాం.

1 / 5
పవిత్రమైన మాసాల్లో కార్తీక మాసం కూడా ఒకటి. శివ కేశవులకు చాలా ఇష్టమైన మాసం కార్తీక మాసం. అందుకే ఈ సమయంలో ప్రజలు అందరూ కూడా శివుడు, విష్ణువును పూజిస్తుంటారు. నిత్యం దైవారాధన చేస్తుంటారు. అలాగే ఆలయాల్లో, ఇంటిలో దీపాలు వెలిగిస్తుంటారు.

2 / 5
అయితే ఈ మాసంలో ప్రత్యేకంగా ఉసిరి దీపం, నారికేల దీపం, ఆకాశ దీపం వెలిగిస్తుంటారు. మరి అసలు కార్తీక మాసంలో ఆకాశ దీపం ఎందుకు వెలిగిస్తారు అంటే? దీని వెనక అనేక కథనాలు ఉన్నాయంట. కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఒక దీపం తీసుకొని దానికి చుట్టూ హోల్స్ చేసి, ఒక పొడవైన కర్రతో ఎత్తైన ప్రదేశంలో దీపం వెలిగిస్తారు. ఇది ఎప్పుడూ సంధ్యాకాలంలో చేస్తుంటారు.

3 / 5
ఇలా కార్తీక మాసంలో ఆకాశ దీపం వెలిగించడం వలన సకల శుభాలు కలుగుతాయంట. అందుకే చాలా మంది ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. కొందరు తమ ఇంటి వద్దే వెలిగిస్తే, మరికొంత మంది ఆలయ ప్రాంతంలో ధ్వజస్తంభం సమీపంలో ఎత్తైన ప్రదేశాల్లో వెలిగిస్తుంటారు. ఇలా ఆకాశ దీపం వెలిగించడం అంటే? సర్వలోకాలకు వెలుగులు ప్రసరింపచేయడం అన్నట్లు అని చెబుతున్నారు పండితులు.

4 / 5
ఇక ఇలా కార్తీక మాసంలో ఆకాశ దీపం వెలిగించడం అంటే, మన పితృదేవతలకు మార్గం సుగమం చేయడం, అలాగే దైవాను గ్రహం కలగడానికి వెలిగిస్తారంట. కార్తీక మాసంలో పూర్వీకులు భూలోకానికి వస్తారంట. అయితే వారి ఆశీస్సులు పొందడానికి, వారిని స్మరించుకొని, ఆకాశ దీపం వెలిగించడం వలన వారి  అనుగ్రహం లభిస్తుంది. వారికి మార్గదర్శకత లభిస్తుందని నమ్మకం.

5 / 5
అంతే కాకుండా పురాణాల ప్రకారం.. ఆకాశ దీపం శివకేశవుల తేజస్సును జగత్తుకు అందిస్తుందని, సమాజంలోని,మనుషుల హృదయాల్లోని అజ్ఞానపు చీకట్లను తొలగిస్తుందని నమ్ముతారు. అందుకే కార్తీక మాసంలో ఆకాశ దీపం వెలిగిస్తారంట. నోట్ : పై సమాచారం కేవలం పండితులు, ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us