
శని గ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనిని న్యాయాధిపతి అంటారు. కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తుంది. అయితే శని గ్రహం రాశి సంచారం చాలా ఆలస్యంగా జరుగుతుంది. దాదాపు రెండున్నర సంవత్సరాల కాలం శని ఒక రాశిలోనే సంచారంలో ఉంటుంది. తర్వాత వేరే రాశిలోకి ప్రవేశిస్తుంది. అయితే 2027 జూన్లో శని వృషభ రాశిలోకి సంచారం చేయనుంది. దీని ప్రభావం 12 రాశులపై బలంగా పడనుంది. కాగా, ఇప్పుడు మనం ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చూసేద్దాం.

కుంభ రాశి : కుంభ రాశి వారికి 2027లో ఏలినాటి శని చివరి దశ నడుస్తుంది. ఇప్పటివరకు పడిన కష్టాలన్నీ నెమ్మదిగా తగ్గిపోతాయి. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది, చాలా కాలంగా ఆగిపోయిన ప్రమోషన్ వస్తుంది. ఆర్థికంగా కుదుటపడతారు. కుటుంబంలో ప్రశాంతత వస్తుంది. కష్టపడే వారికి శని తప్పకుండా మంచి ఫలితం ఇస్తాడు. శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మరింత మంచిది.

మీన రాశి : మీన రాశి వారికి 2027లో ఏలి నాటి శని మధ్య దశ కొనసాగుతుంది. ఇది పరీక్షా కాలం లాంటిది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ ఓపిక పట్టిన వారికి మంచి ఫలితం దక్కుతుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించాలి. దగ్గరి వారితో మాట పట్టింపులకు పోకూడదు. విద్యార్థులకు చదువులో శ్రద్ధ పెరిగితే విజయం వస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

వృషభ రాశి : వృషభ రాశిలోకి 2027 జూన్లో శని ప్రవేశిస్తున్నందున ఈ రాశి వారికి శని ప్రభావం నేరుగా పడుతుంది. కొత్త బాధ్యతలు వస్తాయి, పని భారం పెరుగుతుంది. అయినా ఇది మీకు ఎదుగుదలను ఇచ్చే కాలమే. ఆస్తి, భూమి విషయాల్లో లాభం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి మంచి అవకాశం వస్తుంది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకూడదు. నిజాయితీగా కష్టపడితే శని మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాడు.

మేష రాశి : మేష రాశి వారికి 2027లో శని వల్ల ధన స్థానంలో మార్పు రానుంది. ఖర్చులు పెరుగుతాయి కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు తగ్గించుకుంటేనే లాభం ఉంటుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది, కానీ మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో కాళ్లు, నడుము నొప్పి ఇబ్బంది పెట్టవచ్చు. కోపాన్ని తగ్గించుకుంటే సమస్యలు దూరం అవుతాయి.