
కావాల్సిన పదార్దాలు : ఒక పెద్ద సొరకాయ , ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, మూడు కప్పుల పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకు ఆకులు , అర టీ స్పూన్ ఆవాలు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, కొత్తిమీరను తీసుకోవాలి.

ముందుగా సొరకాయను తీసుకుని నీటిలో బాగా కడిగి చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత ఒక గిన్నెలో పెరుగును తీసుకుని, రెండు గ్లాస్ లు మంచి నీళ్లు పోసి మజ్జిగ కవ్వంతో తిప్పుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మీ ఇంట్లో ఏది ఉంటే గ్యాస్ లేదా కట్టెల పొయ్యి ఉంటే దానిని వెలిగించి పెనం పెట్టి ఆయిల్ వేసి సొరకాయ ముక్కలు, అర టీ స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు వేసి బాగా ఉడికించాలి. ఈ సొరకాయ ముక్కలు మెత్తగా అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మజ్జిగను పోసి, మీడియం మంటపై ఉడికించాలి.

ఆ తర్వాత మళ్ళీ కొత్తగా పాన్ లేదా కంచుడు తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు , పచ్చిమిర్చి ముక్కలు, ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి మజ్జిగలో బాగా ఉడికించాలి.

సమ్మర్లో ఈ సొరకాయ మజ్జిగ పులుసును తాగితే బాడీలో ఉన్న వేడి మొత్తాన్ని కొట్టేస్తుంది. మీకు ఇంకా రుచిగా కావాలంటే దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మంచిది. సొరకాయపెరుగు పచ్చడిని వేడి అన్నం అంటే సద్దన్నంలో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది.