Knowledge: పని ప్రదేశాల్లో రంగురంగుల హెల్మెట్లు, టోపీలు.. వీటి వెనక అసలు మతలబు ఏంటో తెలుసా..

|

Mar 30, 2022 | 5:33 PM

నిర్మాణ రంగంలోని ఉద్యోగులు, కార్మికులు వివిధ రంగుల హెల్మెట్లు, టోపీలు ధరించడం మనం చూస్తూనే ఉంటాం. మరి వారు వాటినెందుకు ధరిస్తారు? ఆ రంగుల వెనక మతలబు ఏంటంటే...

1 / 7
పని ప్రదేశాల్లో ఎక్కువగా కార్మికులు నీలిరంగు హెల్మెట్‌లు ధరించి కనిపిస్తారు. సాధారణంగా వీటిని మెకానిక్‌లు, మెషిన్ ఆపరేటర్లు మొదలైన వారు ధరిస్తారు.

2 / 7
అదే సమయంలో లేబర్ పనులు చేసేవారికి పసుపు రంగు హెల్మెట్‌లను కేటాయిస్తారు.

3 / 7
ఎక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నా కార్మికులు హెల్మెట్ ధరించడం మనం చూస్తుంటాం. అయితే వేర్వేరు చోట్ల కార్మికులు వేర్వేరు రంగుల్లో హెల్మెట్లను ధరిస్తుంటారు. మరి ఈ హెల్మెట్ల రంగుకు ప్రామాణికం ఏమైనా ఉందా? అంటే అదేమీ లేదు. కేవలం హోదాను బట్టి ఈ హెల్మెట్లు ధరిస్తారు.  ఈ రంగురంగుల హెల్మెట్ల వాడకానికి సంబంధించి విదేశాల్లో పక్కా నిబంధనలు అమల్లో ఉన్నాయి. అయితే మనదేశంలో మాత్రం ఎలాంటి నియమాలు, నిబంధనలు లేవు

4 / 7
ఇక తెలుపు రంగు వైట్ హెల్మెట్ లేదా క్యాప్ గురించి మాట్లాడుకుంటే.. ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్ మొదలైన సీనియర్ ఉద్యోగులు వీటిని ఎక్కువగా ధరిస్తారు.

5 / 7
ఇక నారింజ రంగు హెల్మెట్‌ను ఎలక్ట్రీషియన్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక బూడిద రంగు (గ్రే కలర్‌) హెల్మెట్లను సందర్శకులు లేదా కస్టమర్‌ల కోసం కేటాయిస్తారు.

6 / 7
పర్యావరణ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులు ఆకుపచ్చ రంగు హెల్మెట్‌లు ధరిస్తారు. ఇక అగ్నిప్రమాద నివారణ శాఖకు చెందిన వ్యక్తులు ఎరుపు రంగు హెల్మెట్‌లు ధరిస్తారు.

7 / 7
అయితే పని ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా రక్షణ కోసం వీటిని ఉపయోగించాలని ఆదేశాలున్నాయి.