
రోగనిరోధక శక్తి పెంపు,క్యాన్సర్ నిరోధకం: పొట్లకాయలో క్యాన్సర్ నిరోధక గుణాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిలోని కుకుర్బిటాసిన్ అనే సమ్మేళనాలు శరీరంలో రక్షణ వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. అలాగే దీనిలోని ఫైటోన్యూట్రియెంట్లు జ్వరం వచ్చినప్పుడు శరీరం త్వరగా కోలుకోవడానికి, అలసట, నీరసం తగ్గడానికి సహాయపడతాయి.

గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ: గుండె జబ్బులు ఉన్నవారికి పొట్లకాయ అత్యుత్తమ ఆహార ఎంపిక. గుండె దడ, ఛాతి నొప్పి, హైబీపీ సమస్యలను తగ్గించడంలో ఇది మేలు చేస్తుంది. రోజువారీగా పొట్లకాయను తీసుకోవడం లేదా 30 ml పొట్లకాయ రసాన్ని తాగడం వల్ల గుండె పనితీరు మెరుగుపడి హార్ట్ ఎటాక్ ప్రమాదం తగ్గుతుంది.

కీళ్ల నొప్పులు, ఎముకల దృఢత్వం: పొట్లకాయలో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. దీనిని క్రమంతప్పకుండా తింటే కీళ్ల నొప్పులు, వాపులు దూరం అవుతాయి. ఆర్థరైటిస్, గౌట్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

లివర్ ఆరోగ్యం, కామెర్ల నివారణ: పొట్లకాయ కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జ్వరం లేదా కామెర్లు వచ్చిన వారు పొట్లకాయను ధనియాలతో కలిపి తీసుకుంటే త్వరగా కోలుకుంటారని నిపుణులు చెబుతున్నారు.

నిద్రలేమి, జుట్టు సంరక్షణ: పొట్లకాయను పేస్ట్‌లా చేసి హెయిర్‌ప్యాక్‌గా వేసుకుంటే తలకు మెరుగైన పోషణ లభిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారించి, చుండ్రు సమస్యను పోగొడుతుంది. మానసిక ప్రశాంతతను అందించి, రాత్రుళ్లు హాయిగా నిద్రపోవడానికి తోడ్పడుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి, అనేక వ్యాధుల నుంచి రక్షణ ఇచ్చే పొట్లకాయను మన డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.