బరువు తగ్గాలనుకుంటే.. సాయంత్రం వేళల్లో పానీపూరి తినాలి. ఆ తర్వాత నిద్రపోయే ముందు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి. శరీరం నిర్విషీకరణ బాగా జరుగుతుంది. శరీరం బాగుంటుంది, అనేక శారీరక సమస్యలు కూడా తొలగిపోతాయి.
మఖానా - మఖానా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా రుచిగా ఉండటంతోపాటు మఖానాలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని బరువు తగ్గించే ఆహారంలో చేర్చుకోవచ్చు. స్నాక్‌గా కూడా తీసుకోవచ్చు. దీంతో అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి.
మొలకలు - బరువు తగ్గించే ఆహారంలో మొలకలను చేర్చుకోవచ్చు. ఇవి చాలా రుచికరమైనవి.. ఆరోగ్యకరమైనవి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు మొలకల్లో పుష్కలంగా ఉంటాయి. ఇది పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా వీటిని స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు.
డ్రై ఫ్రూట్స్ - బరువు తగ్గించే ఆహారంలో అనేక రకాల డ్రై ఫ్రూట్స్‌ని చేర్చుకోవచ్చు. రుచిగా ఉండే వీటిలో అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి.
చిలగడదుంప చాట్ - స్వీట్ పొటాటో చాట్ చాలా ఆరోగ్యకరమైనది. దీంతోపాటు మచి రుచిగా కూడా ఉంటుంది. వీటిని స్నాక్‌గా తీసుకోవచ్చు. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. ఇది ఫైబర్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. అవి మన జీర్ణవ్యవస్థను, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి పని చేస్తాయి.