
మనలో ఎంతో మంది పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారు. ఇవి ముఖం చేతుల మీద ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఈ బాధను ఎవరికీ చెప్పుకోలేకుండా ఉంటుంది. మీరు ఖర్చు లేకుండా మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే వీటిని వదిలించుకోవచ్చు. మరి, అస్సలు లేట్ చేయకుండా దీనిని ఎలా తీసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

మీ ముఖం, మెడ, చేతులపై ఉన్న పులిపిర్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? వాటిని తగ్గించుకోవడానికి హాస్పిటల్స్ చుట్టూ వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో దొరికే వాటితో ఈ పులిపిర్లను ఎలా రాలిపోయేలా చేయోచ్చు. ఇది తెలిసిన తరువాత ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం అని అనుకోకుండా ఉండలేరు.

వెల్లుల్లి, ఉల్లిపాయ రసం రసం: నిజం చెప్పాలంటే ఈ పులిపుర్లు మీ శరీరం మీద ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ, కొన్ని సార్లు దురద ఉంటాయి. ఈ పులిపిర్లను వదిలించుకోవడానికి వెల్లుల్లి, ఉల్లిపాయ మంచిగా పని చేస్తాయి. ఇంకా దీనిలో కొద్దిగా ఉప్పు కలిపి ఈ పులిపుర్లు ఉన్నచోట రాస్తే కొద్దీ రోజుల్లోనే ఈ పులిపిర్లు రాలిపోతాయి.

అరటిపండు తొక్క : మీరు రోజూ రాత్రి పడుకునే ముందు ఈ అరటిపండు తొక్కను తీసుకుని వీటిపై రుద్దుతూ ఉంటే ఇవి రాలిపోతాయి. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె లో కొంచం కర్పూరం కలిపి రాస్తే ఇవి తగ్గుతాయి. ఈ పాత కాలం టిప్స్ ను మీరు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. వీటి నుంచి తప్పక బయట పడవచ్చు.

అయితే, మీరు దీనిని పాటించే ముందు వైద్యునిసలహాతోనే తీసుకోవాలి. అప్పుడు సమస్య పెద్దది కాకుండా ఉంటుంది. (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)