సాయంత్రం స్నాక్‌కు బెస్ట్.. వేడి వేడి ఉల్లి వడలు ఇలా చేస్తే అదిరిపోవడమే!

Updated on: Oct 01, 2026 | 3:34 PM

సాయంత్రం అయ్యిందంటే చాలు చాలా మంది పిల్లలు తమ పిల్లలకు లేదా ఇంటిలో ఉన్న వారికి ఏవైనా టేస్టీ టేస్టీగా చేసి పెట్టాలి అనుకుంటారు. అయితే అలాంటి వారి కోసమే ఈ రిసిపీ, పిల్లలకు లేదా ఇంట్లో ఉన్నవారికి వేడి వేడిగా రుచికరంగా ఈ ఉల్లి వడలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. కాగా, వీటిని చాలా సింపుల్‌గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఉల్లి వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : ఉల్లిపాయలు నాలుగు లేదా ఐదు, ఉప్పు వన్ టీ స్పూన్ రుచికి సరిపడ, కరివేపాకు, పచ్చి మిర్చి, అల్లం చిన్న ముక్కలు, జీలకర్ర, కారం, మైదా పిండి, నూనె డీప్ ఫ్రైకి సరిపడ.

1 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే .. ముందుగా  ఉల్లిపాయలను తీసుకుని, వాటిని పొడవుగా, సన్నగా కట్ చేసుకోవాలి.  కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను చేతితో మెల్లగా నొక్కుతూ విడివిడిగా చేసుకోండి. తర్వాత అందులో అర టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలలో నుంచి సహజంగా నీరు ఊరుతుంది. ఈ నీటితోనే మనం పిండిని కలుపుకుంటాము. అదనంగా నీరు చేర్చవద్దు, ఎందుకంటే అలా చేస్తే వడలు కరకరలాడకుండా మెత్తగా మారతాయి. కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచండి.

2 / 5
 ఐదు నిమిషాల తర్వాత, మూత తీసి, సన్నగా తరిగిన కరివేపాకు, చిన్న ముక్కలుగా తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, అర టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం బాగా కలపండి. ఈ మసాలా దినుసులు ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలా చూడండి.  ఇప్పుడు అర కప్పు మైదా పిండిని కొద్దికొద్దిగా వేసుకుంటూ కలపండి. ఒకేసారి మొత్తం పిండిని వేయకూడదు.

3 / 5
మైదాకు బదులుగా మీరు కార్న్ ఫ్లోర్, బియ్యప్పిండి, గోధుమ పిండి లేదా శనగపిండిని కూడా ఉపయోగించవచ్చు. మైదా వేయడం వల్ల వడలు మరింత కరకరలాడుతూ వస్తాయి. పిండిని అదనపు నీరు లేకుండా ఉల్లిపాయలలోని నీటితోనే గట్టిగా కలపాలి.  పిండి ఉల్లిపాయ ముక్కలకు అంటుకునేలా ఉండాలి కానీ, పిండి ఎక్కువగా ఉల్లిపాయలు తక్కువగా ఉండకూడదు.

4 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో సరిపడ నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లి వడుల ప్రిపేర్ చేసుకుంటూ అందులో వేసుకోవాలి. మంటను  మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, రెండు వైపులా తిప్పుకుంటూ, గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారి, కరకరలాడే వరకు బాగా వేయించుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో వేయించడం వల్ల వడలు లోపల కూడా బాగా ఉడికి, బయట కరకరలాడతాయి.

5 / 5
ఇలా అన్ని వడలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిలో ఉన్న నూనె పీల్చుకోవడానికి వాటిని వేరే ప్లేట్‌లో పేపర్ వేసి అందులో వేయాలి. అలా చేయడం వలన నూనె పీల్చుకొని వడలు బాగా ఉంటాయి. ఇక  ఈ కరకరలాడే ఉల్లి వడలను వేడి వేడిగా టొమాటో కెచప్‌తో కలిపి అందిస్తే కుటుంబసభ్యులు అందరూ, ముఖ్యంగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది సాయంత్రం పూట ఒక అద్భుతమైన, రుచికరమైన అల్పాహారం.

Loading...
Unable to load recommendations.
Follow Us