Whitening Teeth Tips: పసుపు దంతాలతో ఇబ్బంది పడుతున్నారా.. వంటింటి చిట్కాలతో తెల్లగా మిలమిలా మెరుస్తాయి..

|

May 07, 2023 | 11:56 AM

అందం ఎదుటివారిని ఎలా ఆకర్షిస్తుందో.. చిరునవ్వు కూడా అదే విధంగా ఎదుటివారిని ఆకర్షిస్తుంది. అయితే చాలామంది దంతాల రంగు పసుపుగా మారడంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో నవ్వు వచ్చినా కూడా చేయి అడ్డుపెట్టుకుని నవ్వుతూ ఉంటారు. చాలామంది ఈ పసుపు దంతాలతో ఇబ్బంది పడతారు. ఈరోజు వంటింటి చిట్కాలతో తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. 

1 / 9
చాలామంది పసుపుగా మారిన తమ దంతాలను తెల్లగా మార్చుకోవడానికి వేల డబ్బులను ఖర్చు చేస్తారు. అయితే వంటింట్లో దొరికే ఈ పదార్ధాలతో కూడా దంతాలు తెల్లగా మిలమిలా మెరిసేలా చేసుకోవచ్చు. 

2 / 9
అరటి పండు తిని తొక్క పడేస్తూ ఉంటాం. దంతాలను తెల్లగా మార్చుకోవటానికి అరటి పండు మంచి సహాయకారి. అర‌టి పండు తొక్క‌ల‌తో దంతాల‌పై రుద్ద‌డం వ‌ల్ల పళ్లకు ఉన్న గార,పసుపు రంగు పోయి మెరుస్తూ ఉంటాయి. దంతాలు, చిగుళ్లు ధృడంగా ఉంటాయి. నోటి దుర్వాసన నివారింపబడుతుంది.

3 / 9
నిమ్మకాయ దంతాలపై ఏర్పడిన పసుపు గారను తొలగిస్తుంది. నీటిలో నిమ్మరసం కలిసి ఆ నీటిని పుక్కిలి పట్టడం వలన దంతాల పసుపు రంగు తొలగిపోతుంది. నోరు దర్వాసన రాకుండా చేస్తుంది.   

4 / 9
ఆయిల్ ఫూలింగ్ కూడా దంతాలు తెల్లగా మెరిసేలా చేస్తాయి. ఆయిల్ పుల్లింగ్‌కు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె ఏదైనా ఉపయోగించవచ్చు. కొంచెం నూనెను నోటిలో వేసుకుని పదినిమిషాలు పుక్కిలి పట్టాలి. ఇలా చేయడం వలన దంతాలు తెల్లగా మెరుస్తాయి. 
 
5 / 9
ఉప్పు కూడా దంతాలను తెల్లగా ఉండేలా చేస్తుంది. ఉప్పుతో దంతాలను తోమడం వలన తెల్లగా మెరుస్తాయి. ధృడపడతాయి. 

6 / 9
వంట చేయడానికి ఉపయోగించే వంట సోడా పళ్ల పసుపు రంగుని తొలగిస్తుంది. వారానికి ఒకటి లేదా రెండుసార్లు పేస్టు ఉన్న బ్రష్‌పై చిటికెడు బేకింగ్ సోడా వేసుకుని పండ్లను రుద్దుకోవాలి. ఇలా చేయడం వలన దంతాలు శుభ్రపడతాయి. 

7 / 9
స్ట్రాబెర్రీలు దంతాల పసుపును తొలగించడంలో కూడా సహాయపడతాయి. స్ట్రాబెర్రీలను దంతాలపై రుద్దడం లేదా తినడం వల్ల మీ దంతాలు సహజంగా తెల్లగా మారుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది దంతాల పసుపును తొలగించడంలో సహాయపడుతుంది.

8 / 9
ఇంగువను పసుపు దంతాలను తెల్లగా చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. అరకప్పు నీటిలో రెండు చిటికెల ఇంగువ వేసి మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి రోజుకు రెండుసార్లు పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల దంతాల పసుపు రంగు కొద్ది రోజుల్లో పోతుంది.

9 / 9
ఈ వంటింటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దంతాలు తెల్లగా మారటమే కాదు..  దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. చాలా తక్కువ ఖర్చుతోనే పసుపు దంతాలను మిలమిల మెరిసే విధంగా చేసుకోవచ్చు. 