
శుభ సంకేతాలు: మనం ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు గుమ్మం ముందే పండ్లు, కూరగాయలు అమ్మే వ్యక్తి లేదా నిండుగా ఉన్న బండితో పాత సామాన్లు కొనే వ్యక్తి కనిపిస్తే దాన్ని శుభ సంకేతంగా భావిస్తారు. ఇది మీరు వెళ్లే పనిలో విజయాన్ని సూచిస్తుంది. అలాగే చెత్తతో నిండిన బుట్టతో సఫాయీ కార్మికుడు కనిపించడం కూడా శుభప్రదమే.

ఆవు, నీటి కుండ: ఇంటి నుండి బయటకు రాగానే ఆవు లేదా నీటితో నిండిన పాత్రను తీసుకెళ్తున్న వ్యక్తి కనిపిస్తే అది చాలా మంచి శకునంగా భావిస్తారు. అలాగే ఇంట్లో పక్షులు గూడు కట్టుకోవడం శాంతి, శ్రేయస్సుకు చిహ్నమని.. ఇది ఇంట్లోకి ఐశ్వర్యం వస్తుందనే దానికి సంకేతమని చెబుతుంటారు. అలాగే ఉదయాన్నే గుడిలోని గంటల శబ్దం, శంఖారావం వినపడటం లేదా ఆవును దర్శించుకోవడం చాలా శుభప్రదంమని జ్యోతిష్యం చెబుతోంది. శంఖధ్వని వాతావరణాన్ని సైతం శుద్ధి చేస్తుందని చాలా మంది నమ్ముతారు.

అశుభ సంకేతాలు: ఇంట్లో అకస్మాత్తుగా తులసి మొక్క ఎండిపోతే దాన్ని అశుభంగా పరిగణిస్తారు. ఎందుకంటే తులసిని పవిత్రతకు, సానుకూల శక్తికి ప్రతీకగా భావిస్తారు కాబట్టి, అది ఎండిపోతే ఏదో సమస్య రాబోతుందనడానికి సంకేతమని చాలా మంది నమ్ముతారు. అలాగే రాత్రి వేళల్లో కుక్కలు ఏడవడం మంచిది కాదని అంటారు. ఇలా కుక్కలు ఏడుతస్తే సంక్షోభం లేదా అనారోగ్య సమస్యలు రావడానికి సంకేతంగా భావిస్తారు.

ఒక్క తుమ్ము: మనం ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఒక్కసారి తుమ్మితే కాసేపు ఆగి వెళ్తారు. తుమ్ము అనేది ఆరోగ్య పరమైన హెచ్చరిక కావచ్చు అనే ఉద్దేశంతో అలా చేసేవారు. అయితే, వరుసగా రెండు సార్లు తుమ్మితే అది సాధారణమైనదిగా భావిస్తారు. అందుకే ఒక్కసారి తుమ్మితే ఆగి కాసేపు ఆగి వెళ్లమని చెప్తారు.

Note : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు