నాన్‌‌వెజ్ తినని గెస్ట్‌లకు.. చికెన్ కర్రీని మించిన రుచితో పకోడీ కర్రీ

Updated on: Oct 04, 2026 | 12:58 PM

 హఠాత్తుగా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇంట్లో చికెన్, మటన్ లాంటివి వండలేని పరిస్థితి ఉంటే లేదా వారు పూర్తిగా శాకాహారులైతే ఏం చేయాలో పాలుపోదు. అదే సమయంలో ఫ్రిడ్జ్‌లో కూరగాయలు కూడా లేకపోతే సమస్య మరింత పెద్దదవుతుంది. ఇలాంటి సందర్భాల్లో కేవలం ఇంట్లో నిల్వ ఉండే శనగపిండి, పెరుగు, ఉల్లి-టమాటాలతో నాన్‌వెజ్ గ్రేవీని తలపించేలా ఘుమఘుమలాడే 'శనగపిండి పకోడీ గ్రేవీ కర్రీ'ని అత్యంత రుచికరంగా వండవచ్చు.

1 / 5
కావలసిన పదార్థాలు: పకోడీల కోసం: 1 కప్పు శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, పావు టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, పావు టీస్పూన్ కారం పొడి, పావు టీస్పూన్ గరం మసాలా పొడి, 1 టీస్పూన్ నూనె, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు. ప్రత్యేక మసాలా పొడి కోసం: 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు,  1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు

2 / 5
గ్రేవీ తయారీ కోసం: 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టీస్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ , 2 పచ్చిమిరపకాయలు  చీలికలు, చిన్న ముక్కలుగా తరిగిన 2 టమాటాలు, అర టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ కారం పొడి, 1 టీస్పూన్ ధనియాల పొడి, పావు టీస్పూన్ మిరియాల పొడి, పావు టీస్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 గ్లాసు నీళ్లు, 1 రెమ్మ కరివేపాకు,  అర కట్ట కొత్తిమీర తరుగు

3 / 5
తయారీ విధానం: ఒక బౌల్‌లో కప్పు శనగపిండి, తగినంత ఉప్పు, పావు టీస్పూన్ చొప్పున పసుపు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ఒక టీస్పూన్ నూనె వేయాలి. రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి పిండిని ముద్దలా గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ముక్కలుగా తుంచుతూ పకోడీల్లా చేసి పక్కన పెట్టుకోవాలి. బాండీలో నూనె వేడిచేసి, ఈ పకోడీలను వేసి మీడియం మంటపై బంగారు రంగు వచ్చేవరకు వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి.

4 / 5
మిక్సీ జార్‌లో 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి. గ్రేవీ కోసం కడాయిలో టేబుల్ స్పూన్ నూనె వేసి జీలకర్ర, బిర్యానీ ఆకు వేయించాలి. ఆ తర్వాత సన్నని ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు టమాటా ముక్కలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి.. మూతపెట్టి టమాటాలు మెత్తబడే వరకు మగ్గించాలి.

5 / 5
 టమాటాలు గుజ్జులా మగ్గాక మిక్సీ పట్టిన నువ్వుల మసాలా పొడి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి నూనె సైడ్స్‌కి తేలే వరకు బాగా కలపాలి. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు పోసి, వేయించి ఉంచుకున్న శనగపిండి పకోడీలను వేయాలి. మూతపెట్టి మీడియం మంటపై 15 నిమిషాల పాటు ఉడికించాలి. పకోడీలు రసాన్ని పీల్చుకుని గ్రేవీ చిక్కబడ్డాక.. చివర్లో కరివేపాకు, తాజా కొత్తిమీర తరుగు చల్లి కలిపి దించుకోవాలి. అంతే, నోరూరించే రెస్టారెంట్ స్టైల్ 'శనగపిండి పకోడీ కర్రీ' సిద్ధం! నాన్‌వెజ్ కర్రీలకు ఏమాత్రం తీసిపోని రుచితో అందరినీ మెప్పిస్తుంది !

Loading...
Unable to load recommendations.
Follow Us