Asteroids: గ్రహశకలాలు అంటే ఏమిటి? ఇప్పటివరకూ భూవాతావరణం లోకి వచ్చిన పెద్ద గ్రహశకలాలు ఎన్ని?

|

Jul 01, 2021 | 3:21 PM

Asteroids: గ్రహశకలాలు భూమి పైకి నేరుగా వచ్చిపడితే పెను ప్రమాదం తప్పదు. గ్రహశకలాల కదలికలను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు గమనిస్తూ ఉంటారు. 

1 / 5
నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్స్ (NEO) అంటే గ్రహశకలాలు తీవ్రమైన వేగంతో ఎగురుతూ భూమి గుండా వెళతాయి లేదా కొన్ని సమయాల్లో ఎగువ వాతావరణాన్ని తాకుతాయి. వీటి గురించి అటు శాస్త్రవేత్తలకు, ఇటు ప్రజలకు ఎప్పుడూ ఉత్సుకత ఉంటూనే ఉంటుంది.

2 / 5
గ్రహశకలం అంటే సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి మిగిలిపోయిన రాతి శకలాలు. గ్రహశకలం కదలికను గుర్తించే నాసా జాయింట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (జెపిఎల్) ప్రకారం, మన గ్రహం నుండి దూరం భూమి నుండి సూర్యుడికి దూరం కంటే 1.3 రెట్లు తక్కువగా ఉన్నప్పుడు ఒక గ్రహశకలాన్ని ఒక NEO గా వర్గీకరిస్తారు.  (భూమి-సూర్యుడి దూరం సుమారు 93 మిలియన్ మైళ్ళు).

3 / 5
గ్రహాల గురుత్వాకర్షణ పుల్ ద్వారా గ్రహశకలాల కక్ష్య మార్గాలు కొన్ని సార్లు ప్రభావితమవుతాయి. ఇవి వాటి మార్గాలను మార్చడానికి కారణమవుతాయి. అందువల్లే, ఈ శకలాలు గతంలో భూమిని గుద్దుకోవడం లేదా భూమిని రాసుకుంటూ దూసుకుపోవడం జరిగింది అని శాస్త్రవేత్తలు విశ్వసిస్తారు.

4 / 5
తుంగస్కా గ్రహశకలం చరిత్రలో భూమిపై అతిపెద్ద ఉల్క దాడి. పొడవైన తుంగస్కా నదిపైకి వచ్చి పడిన ఈ గ్రహశకలం 2,150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 80 మిలియన్ చెట్లను చదును చేయడానికి తగినంత శక్తిని విడుదల చేసింది. 1908 లో ఈ ఘటన జరిగింది. దీనిపై పరిశోధనలు చాలాకాలం తర్వాత 1927 లో ప్రారంభమయ్యాయి. దీని ప్రభావం వలన పడిన బిలం కనుక్కోవడం సాధ్యం కాలేదు. కానీ 25 అంతస్తుల భవనం అంత పరిమాణంలో ఉన్న గ్రహశకలం భూ ఉపరితలాన్ని ఢి కొట్టే ముందు పేలిపోయింది.

5 / 5
ఇదే విధమైన సంఘటన ఫిబ్రవరి 2013 లో రికార్డ్ అయింది. సెకనుకు 18.6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే భారీ ఫైర్‌బాల్ వాతావరణంలోకి ప్రవేశించి రష్యాలోని చెలియాబిన్స్క్ మీదుగా ఆకాశంలో విచ్ఛిన్నమైంది. ఈ ఉల్క వ్యాసం 18 మీటర్లు. దాని ద్రవ్యరాశి 11,000 టన్నులు. ఈ సంఘటనలో 440 కిలోటన్‌ల టిఎన్‌టికి సమానమైన శక్తిని విడుదల అయింది.