
జ్యోతిష్య శాస్త్రం ప్రజరం చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు పాజిటివ్ గా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

శని ఒకసారి కన్నెర్ర చేస్తే ఇక అంతే సంగతి ఇక ఈ నెలలో వీరికి కష్టాలు ఎక్కువనున్నాయి. శని గ్రహం తన స్థానాన్ని మార్చుకోనుంది. దీని వలన సమస్యలు ఎక్కువైతాయి. మొదలు పెట్టిన పనిలో ఆటంకాలు వస్తాయి. పక్కన ఉండేవాళ్ళు వీరిని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు. ఆ రాశు లేంటో ఇక్కడ చూద్దాం..

ధనుస్సు రాశి : ఈ పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి. సడెన్ గా ఇంట్లో డబ్బు లేకుండా పోతోంది. ఉన్నవి సరిపోనట్లు పెద్ద భారాలు పడతాయి ఈ సమయంలో వ్యాపారాలు మొదలు పెట్టకపోవడమే మంచిది. పెట్టుబడులు పెట్టిన వాళ్లకి ఒక్క రూపాయి కూడా రాదు చాలా నష్ట పొతారు. భార్య భర్తల మధ్య గొడవలు మొదలవుతాయి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండకపోతే మోసం జరిగే అవకాశం ఉంది.

కుంభ రాశి: ఉద్యోగం చేసే చోట కొంచం జాగ్రత్త అవసరం. ఇంట్లో గొడవలు జరుగుతాయి ఇది మీ గౌరవాన్ని దెబ్బ తీస్తుంది ఉద్యోగం అవకాశం మధ్యలోనే ఆగిపోతోంది. అప్పులు ఎక్కువవుతాయి. పెట్టుబడులు అస్సలు పెట్టకండి ఉన్న డబ్బును దాచుకోండి. మీ వైవాహిక జీవితంలో ప్రశాంతత ఉండదు. బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడండి.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.