
వృషభ రాశి : వృషభ రాశి వారికి ఈ 116 రోజులు స్వర్ణయుగం లాంటివి. శని అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పాత అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా వీరికి ఈ సమయం కలిసి వస్తుంది

మిథున రాశి : మిథున రాశి వారికి కెరీర్ పరంగా దూసుకుపోయే సమయం. పోటీ పరీక్షల్లో విజయం, విదేశీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తండ్రి నుంచి ఆస్తి లేదా సహాయం లభిస్తుంది. కొత్త వాహనం, ఇల్లు కొనే యోగం ఉంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం తగ్గి, ఈ రాశి వారికి మంచి రోజులు మొదలయ్యాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో లాభాలు వస్తాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది.

తుల రాశి :తుల రాశి వారికి శని సంచారం వల్ల రాజయోగం పడుతోంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. వ్యాపార విస్తరణకు ఇదే మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. దాంపత్య జీవితంలో మధుర క్షణాలు ఉంటాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

మకర రాశి :మకర రాశికి శని అధిపతి కావడంతో ఈ సంచారం అత్యంత శుభప్రదం. 116 రోజుల పాటు మీకు తిరుగుండదు. కెరీర్ లో ఉన్నత స్థానానికి వెళతారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవం, హోదా పెరుగుతుంది. దీర్ఘకాలంగా ఉన్న కోరిక నెరవేరుతుంది.