మహిళల ఇలా చేస్తే అనారోగ్యం అనే మాటే ఉండదు.. ఆరోగ్యానికి ఇవే బ్రహ్మాస్త్రాలు..

Updated on: Feb 22, 2026 | 12:10 PM

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలు ఇల్లు, ఆఫీసు బాధ్యతల మధ్య నలిగిపోతూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా హార్మోన్ల అసమతుల్యత, అలసట, జుట్టు రాలడం వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే వీటన్నింటికీ ఒక సింపుల్ పరిష్కారం ఉందంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రాశి చౌదరి. నటి సమంత రూత్ ప్రభుతో కలిసి నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌లో.. మహిళల జీవనశైలిని మార్చే ఫోర్ పిల్లర్ సూత్రాలను ఆమె వివరించారు.

1 / 5
Life Changing Habits For Women Wellness 2

2 / 5
కార్బోహైడ్రేట్లు వద్దు: బొడ్డు దగ్గర కొవ్వు పేరుకుపోవడానికి కారణం పీచు పదార్థం లేని ఆహారం తీసుకోవడమే. కార్బోహైడ్రేట్లు తగ్గించి.. కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, పండ్లను ఎక్కువగా చేర్చుకోవాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా హార్మోన్లను సమతుల్యం చేస్తుంది.

3 / 5
ప్రోటీన్: మహిళల్లో జుట్టు రాలడం, కండరాల బలహీనతకు ప్రధాన కారణం ప్రోటీన్ లోపమే. ప్రతి భోజనంలో పప్పులు, గుడ్లు, పనీర్, టోఫు లేదా పెరుగు ఉండేలా చూసుకోవాలి. ఇవి శరీర కణాలను మరమ్మతు చేయడమే కాకుండా, కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి.

4 / 5
రాత్రి భోజనం: ఆలస్యంగా భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతిని బరువు పెరుగుతారు. నిద్రపోయే 3 గంటల ముందే డిన్నర్ పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట తేలికపాటి భోజనం చేయడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది, ఉదయాన్నే కడుపు శుభ్రంగా ఉంటుంది.

5 / 5
ఈ చిన్న మార్పులు మీ జీవితంలో 70 శాతం ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. సమంత లాంటి సెలబ్రిటీలు కూడా ఈ పద్ధతులనే పాటిస్తూ ఫిట్‌గా ఉంటున్నారు. మరి మీరు కూడా త్వరగా వీటిని మొదలు పెట్టడం ద్వారా అనారోగ్యానికి చెక్ చెప్పండి..

Loading...
Unable to load recommendations.
Follow Us