
సమ్మర్లో పాతకాలంనాటి గారెలు తింటే వేడి మొత్తం తగ్గుతుంది ఇంకా ఈ గారెలను అల్లం చట్నీతో కానీ, చికెన్ పులుసుతో కానీ తింటే తింటే చాలా టేస్టీగా ఉంటాయి. విపరీతంగా వేడి చేసి యూరిన్ రానివాళ్ళకు ఇవి చాలా బెస్ట్. మరి, ఇంకెందుకు లేట్ కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

సగ్గుబియ్యం పెసరపప్పు గారెలు రెసిపీ కావలసిన పదార్థాలు: ఒక కప్పు సగ్గుబియ్యం, ఒక కప్పు పెసరపప్పు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు , నాలుగు పచ్చిమిర్చి , ఒక చిన్న అల్లం ముక్క, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , కొద్దిగా కరివేపాకు, ఇంకా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు ఇంకా నూనెను తీసుకోవాలి.

ముందుగా సగ్గుబియ్యాన్ని నానబెట్టాలి. అలాగే పెసరపప్పును కూడా నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీరు వంపేసి పెసరపప్పు, మూడు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా దీనిని మెత్తగా పట్టకూడదు. ఇంకా ఇప్పుడు ఈ మిశ్రమంలో నానిన సగ్గుబియ్యం, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు కలపాలి.

స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి వేడి చేయాలి. చేతికి ఆయిల్ రాసుకుని చిన్న చిన్న గారెలుగా ఒత్తుకోవాలి. ఒక వైపు కాలిన తరవాత ఒక వైపు కాలిన తరవాత ఇంకో వైపు కూడా గోల్డ్ రంగులోకి మారే వరకు వేయించాలి. అంతే, వేడి వేడి సగ్గుబియ్యం పెసరపప్పు గారెలు రెడీ

అయితే, మనం వీటిలో వేసే పెసర్లు కొందరికి కడుపు నొప్పిని కలిగిస్తాయి మీకు ఇతర సమస్యలు ఉంటే వైద్యున్ని సంప్రదించి తినడం మంచిది. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)