
మీరు ఈ గింజలను రోజూ చూస్తూనే ఉంటారు ఇవి మన శరీరానికి ఎంత మంచివో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు విత్తనాలు నీళ్లల్లో సులభంగా నాని, శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే, పోషక విలువలు, వాటి వల్ల కలిగే లాభాల విషయంలో ఈ రెండింటి మధ్య కొన్ని కీలక తేడాలు ఉన్నాయి.

ముందుగా శక్తి గురించి చూద్దాం. 100 గ్రాముల చియా సీడ్స్‌లో 486 కిలో క్యాలరీలు లభిస్తే, సబ్జా గింజల్లో 513 కిలో క్యాలరీలు ఉంటాయి. ఈ విషయంలో సబ్జా గింజలు కొద్దిగా ఎక్కువ శక్తిని అందిస్తాయి. తక్కువ సమయంలో నాని, త్వరగా శక్తిని ఇచ్చే గుణం సబ్జా గింజలకు ఉంది, ఇది పెద్ద వయస్సు వారికి లేదా బలహీనంగా ఉన్నవారికి మేలు చేకూరుస్తుంది.

కార్బోహైడ్రేట్ల విషయానికి వస్తే, 100 గ్రాముల చియా సీడ్స్‌లో 42 గ్రాములు, సబ్జా గింజల్లో 44 గ్రాములు ఉంటాయి. ఈ రెండింటిలో కార్బోహైడ్రేట్లు ధాన్యాల కంటే చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా ఈ సాధారణ ధాన్యాల్లో 68 గ్రాములు, తెల్ల బియ్యంలో 78-80 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అలాగే, పిండిపదార్థాలను తగ్గించుకోవాలనుకునే వారికి ఈ విత్తనాలు ఒక మంచి ఎంపిక. ప్రొటీన్స్ విషయానికి వస్తే, చియా సీడ్స్ సబ్జా గింజల కంటే మెరుగ్గా ఉన్నాయి. 100 గ్రాముల చియా సీడ్స్‌లో 16 గ్రాముల ప్రొటీన్ ఉండగా, సబ్జా గింజల్లో కేవలం 10 గ్రాములు మాత్రమే ఉంటుంది. కండరాల నిర్మాణానికి, శరీర కణాల మరమ్మత్తుకు ప్రొటీన్ అవసరం. ఈ విషయంలో చియా సీడ్స్ ఉత్తమమైనవి.

పీచుపదార్థాలు (ఫైబర్) ఆరోగ్యానికి అత్యంత కీలకమైనవి. ఈ విషయంలో చియా సీడ్స్ నంబర్ వన్ అని చెప్పొచ్చు. 100 గ్రాముల చియా సీడ్స్‌లో 35 గ్రాముల పీచుపదార్థాలు ఉంటాయి, సబ్జా గింజల్లో 23 గ్రాములు ఉంటాయి. పీచుపదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, మలబద్ధకాన్ని నివారిస్తాయి, ప్రేగులను శుభ్రపరుస్తాయి. అలాగే, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటివి పెరగకుండా నియంత్రించడంలో సహాయపడతాయి.

గుడ్ బ్యాక్టీరియాను పెంచి, బ్యాడ్ బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్ రెండింటిలోనూ అధికంగా ఉంటాయి. 100 గ్రాముల చియా సీడ్స్‌లో 631 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటే, సబ్జా గింజల్లో 636 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది పాల కంటే ఆరు రెట్లు ఎక్కువ. మీరు వీటిలో ఏ ఒక్కటైనా ఇది రెండు స్పూన్స్ తాగితే.. మీ యవ్వనం తిరిగి వస్తుంది. ఇంకా మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది