
బరువు తగ్గడం చాలా ఈజీ కానీ అది అర్ధం చేసుకోకుండా ఎంతో మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ డబ్బును వదిలించుకుంటున్నారు. మీ వంటగదిలో ఉండే నేచురల్ వాటితో తయారు చేసుకునే దీనిని రోజుకు ఒక టేబుల్ స్పూన్ తింటే.. బాడీ లోపల పేరుకుపోయిన కొవ్వు కొద్దీ రోజుల్లోనే మొత్తం కరుగుతుంది.

బరువు తగ్గించటానికి సబ్జా గింజలు మంచి ఎంపిక. చాలామంది సబ్జా గింజలను వేడి తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటారు కానీ, వాటితో పాటు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వెయిట్ లాస్ చిట్కాను ఎలా చేయాలి? దీన్ని ఏ సమయంలో తీసుకుంటే మంచిదో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

మార్కెట్లో తక్కువ రేటుకే దొరికే వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇటీవలే కాలంలో సబ్జా గింజలని తీసుకునే వాళ్ళు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. వీటిని పోషకాహార నిపుణులు కూడా తీసుకోమని చెబుతున్నారు. ఎందుకంటే, ఇవి ఇప్పటి నుంచి కావు.. పాత కాలం నుంచి వీటిని తీసుకుంటున్నారు. ఈ సబ్జా గింజలను సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు.

మీరు ఏడాది పొడవునా వీటిని తీసుకోవచ్చు. అయితే, మీరు ముందుగా ఒక స్పూన్ గింజలను తీసుకుని ఒక గంట పాటు నీటిలో నానబెడితే వీటి సైజ్ రెండింతలవుతుంది. అంతేకాదు ఇవి నీటిలో వేస్తే మంచిగా ఉబ్బుతాయి. వీటిని నీటిలో నానబెట్టడం వల్ల యాంటీఆక్సిడెంట్స్, జీర్ణ ఎంజైమ్ లను ఇవి రిలీజ్ చేస్తాయి.

వీటిలో పెద్ద మొత్తంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఇవి శరీరంలో కొవ్వును కరిగించడంలో హెల్ప్ చేస్తాయి. (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)