
మండే ఎండల్లో ప్రజలు తమ దాహాన్ని తీర్చుకోవడానికి సహజ పానీయాల వైపే మొగ్గు చూపుతున్నారు ఇవి తాగితే బాడీ చల్ల బడటమే కాకుండా ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గుతుంది ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ కూలీలు ఎక్కువగా తాగుతారు ఎందుకంటే వారు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే ముందు వరకు పని చేస్తూనే ఉంటారు.

ఈ డ్రింక్ ను కేరళలో కూడా తాగుతారు. ఇంకా అనేక ప్రాంతాలలో విపరీతంగా పేరు పొందింది అయితే, ఇది కాస్త కారం, మరి కొంచం తీపి, పులుపుతో ఉంటుంది. ఇది నార్మల్ జ్యూస్ కంటే వేరుగా ఉంటుంది. ఇంకా ఈ రుచికరమైన పానీయాన్ని ఇంట్లోనే చాలా మంది ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారుచేయాలో ఇక్కడ చూద్దాం.

సబ్జా లెమన్ డ్రింక్ కు కావలసినవి: అర కప్పు సబ్జా గింజలు, రెండు నిమ్మకాయలు, ఇంకా నాలుగు పచ్చిమిర్చి , కొద్దిగా పంచదార లేక తేనెను అయినా తీసుకోవచ్చు. ఇంకా ఒక కప్పు ఐస్ ముక్కలు , సరిపడా మంచి నీళ్లు, ఇంకా కొద్దిగా ఉప్పును తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి.

ముందుగా, సబ్జా గింజలను తీసుకుని వాటిని నీటిలో నానబెట్టాలి. అవి ఉబ్బితాయి మారతాయి. ఆ తర్వాత, ఒక పాత్ర తీసుకుని దానిలో సబ్జా గింజలు, రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మకాయ రసం, రెండు పచ్చిమిర్చి, ఉప్పు, పంచదారను కూడా దీనిలో వేయాలి. ఆ తరువాత జార్‌లో దీనిని తీసుకుని ఐస్ ముక్కలు వేసి జా 15 సార్లు పైకి, కిందకి నీరు కలిసి పోయే వరకు షేక్ చేయాలి.

ఈ డ్రింక్ తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది అలాగే సబ్జా గింజలు కూడా బాడీని చల్ల బరుస్తాయి. ఇక వేసవిలో పెరిగే శరీర వేడి, మూత్రపిండాల మంటను కూడా తగ్గిస్తుంది ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇది మాత్రమే కాకుండా జీర్ణక్రియ పని తీరును కూడా మెరుగుపరుస్తుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి.