
ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతాల ఎత్తైన ప్రాంతంలో 'అస్థిపంజరాల సరస్సు (Skeleton Lake)'గా పలిచే రూప్‌కుండ్ సరస్సు అనే మిస్టీరియస్ లేక్ ఒకటి ఉంది. ఇది అక్కడి గర్హ్వాల్ ప్రాంతంలో సముద్ర మట్టానికి సుమారు 16 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ హిమానీనద సరస్సులో మంచు కరిగినప్పుడల్లా వందలాది మానవ అస్థిపంజరాలు బయటపడుతుంటాయి. ఇలా దశాబ్దాలుగా జరుగుతుంది. అక్కడి వచ్చే సందర్శకులను భయపెడుతోన్న ఈ సరస్సు మిస్టరీ వెనుక అసలు కారణం ఏమిటో ఇంత వరకు ఎవ్వరూ కనుగొనలేకపోయారు.

కొందరు ఒక శాపం వల్ల ఇలా జరుగుతుందని నమ్ముతారు. మరికొందరు క్రీ.శ. 850 ప్రాంతంలో సంభవించిన ఒక భారీ వడగళ్ల వానలో చిక్కుకుపోయిన పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మరణించి ఉండవచ్చని భావిస్తారు. కానీ దీని వెనుక ఉన్న అసలు రహస్యం మాత్రం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

మిస్టరీ లేక్ లేదా స్కెలిటన్స్ లేక్ అని కూడా పిలువబడే రూప్‌కుండ్ సరస్సుకు సుదీర్ఘ చరిత్ర కూడా ఉంది. దాని పరిసరాలు, చుట్టూ ఉన్న సహజ సౌందర్యాలు ఒక రహస్య, మర్మమైన అనుభూతిని కలిగిస్తాయి. నందా దేవి జాతీయ పార్కులో ఈ సరస్సు కూడా ఉంది. ఆ సరస్సు చాలా అందంగా ఉంటుంది.

దేవతల భూమిగా ప్రసిద్ధి చెందిన రూప్‌కుండ్ ఆకట్టుకునే పురాణ గాథలు, కథలకు నిలయంగా ఉంది. హిందూ విశ్వాసాల ప్రకారం బెడ్ని బుగ్యాల్ మైదానంలోనే ప్రాచీన వేదాలు లిఖించబడ్డాయని నమ్మకం. సమీపంలోని బెడ్ని కుండ్‌లోనే దుర్గాదేవి తన కలిఅవతారంలో మహిషాసురుడిని సంహరించిందని చెబుతారు. ఇది ఆ ప్రాంతానికి ఒక పవిత్రమైన వాతావరణాన్ని కల్పిస్తుంది.

మరో పురాణ కథనం ప్రకారం రాక్షసులతో పోరాడిన తరువాత పార్వతీ దేవి శుద్ధి చేసుకోవాలని కోరుకుంది. అందువల్ల శివుడు తన త్రిశూలంతో ఒక సరస్సును సృష్టించి, ఆమె స్నానం చేసేందుకు ఏర్పాటు చేశాడు. ఆ సరస్సులోని నీలి నీటిలో పార్వతి స్పష్టమైన ప్రతిబింబం కనిపించడం వల్ల దానికి రూప్‌కుండ్ అనే పేరు వచ్చిందనే మరో నానుడి ఉంది. కలు వినాయక్ కనుమ నుండి చేసే ట్రెక్ మార్గంలో మీరు రూప్‌కుండ్ అగ్నిపర్వత బిలాన్ని చూడవచ్చు. ఇక్కడే పార్వతి స్నానం చేస్తున్నప్పుడు వినాయకుడు కాపలాగా ఉన్నాడని అంటారు.

ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నందా రాజ్ జాత్ యాత్ర జరుగుతుంది. ఈ ప్రదేశాన్ని నాలుగు కొమ్ములు గల ఒక రహస్యమైన పొట్టేలు సందర్శిస్తుందని, అది ఒక దివ్య స్వరూపమని చెబుతారు. ఇలా ఎన్నో జానపద కథలు, పురణ కథలు దీని చూట్టూ ఉన్నాయి. వేసవి కాలంలో రుతుపవనాలకు ముందు వచ్చే మే, జూన్ నెలల్లో ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం.