
మీల్ మేకర్ కర్రీకి కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు మీల్ మేకర్, 5 టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం , పుదీనా కొద్దిగా, మూడు టేబుల్ స్పూన్స్ పెరుగు , ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం , ఒక టేబుల్ స్పూన్ మసాలా దినుసులు , ఒక టేబుల్ స్పూన్ ధనియాలు , రెండు ఉల్లిపాయలు , పసుపు, రెండు పచ్చిమిర్చిని , నాలుగు టమోటాలును తీసుకోవాలి.

మీల్ మేకర్ చిల్లిస్ కర్రీ తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి ఈ మీల్ మేకర్‌ను ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత నీటిని వంపేసి వేరుగా ఉంచాలి. ఇప్పుడు ఒక పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి బాగా ఉడికించిన ఈ మీల్ మేకర్‌ను కూడా వేసి మూడు నిమిషాల బాగా వేయించాలి.

ఇంకా దీనిలో వేయించిన మీల్ మేకర్‌ను కూడా తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, ఇంకా కొంచం కారం, కొద్దిగా పుదీనా, మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, ఇంకా దీనిలో నిమ్మరసం కూడా వేసి బాగా కలపాలి. ఇలా దీనిని పట్టించి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

అలాగే, పాన్‌లో ఆయిల్ వేసి కొద్దిగా ధనియాలు, కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ అదే పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి పసుపు, నాలుగు పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించాలి. ఇంకా టమోటా ముక్కలు, మీల్ మేకర్ మిశ్రమాన్ని కూడా దీనిలో కలపాలి.

ఆ తర్వాత దీనిలో ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి 5 నిముషాల పాటు మీడియం మంటపై బాగా ఉడికించాలి. ఇంకా చివరగా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గస గసాలు, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. ఇంకా ఇది వేడివేడి అన్నం , చపాతీలతో తింటే రుచికరంగా ఉంటుంది,