రెస్టారెంట్ స్టైల్‌లో దమ్ బిర్యానీ.. ఇంట్లో ఎలా చేయాలంటే?

Updated on: Sep 29, 2026 | 7:22 AM

బిర్యానీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా బిర్యానీ తింటుంటారు. అయితే మీరు కూడా బయట కాకుండా ఇంటిలోనే రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే బిర్యానీ రుచి అదిరిపోతుందంట. కాగా, ఇప్పుడు మనం బిర్యానీ తయారీ చూసేద్దాం.

1 / 5
కావలసిన పదార్థాలు: చికెన్: 750 గ్రాములు, బాస్మతి బియ్యం 750 గ్రాములు,పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీస్పూన్లు, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం, పెరుగు, నెయ్యి, ఉల్లిపాయలు, మసాలా దినుసులు, మిరియాలు, లవంగాలు, షాజీరా, జావిత్రి, అనాస పువ్వు, యాలకులు, బిర్యానీ ఆకులు,   ఫుడ్ కలర్.

2 / 5
ముందుగా చికెన్ తీసుకొని మ్యారినెట్ చేయాలి. దీని కోసం ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ వేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి మిర్చీ, కొత్తిమీర, పుదీనా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను చికెన్‌లో వేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం, పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు పక్కన నాననివ్వాలి.

3 / 5
బాస్మతి బియ్యం రెండు మూడు సార్లు కడిగి, దానికి రెండింతల నీటిని  కలిపి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఈ నీటిలో దాల్చినచెక్క, మరాఠీ మొగ్గ,  ఇలాచి, మిరియాలు, లవంగాలు, షాజీరా, జావిత్రి, అనాస పువ్వు, యాలకులు, బిర్యానీ ఆకులు వంటి మసాలా దినుసులు, 2 టీస్పూన్ల ఉప్పు, 1 టీస్పూన్ నెయ్యి, కట్ చేసిన పచ్చిమిర్చి వేసి అరగంట పాటు నాననివ్వాలి. తర్వాత  ఒక పాన్‌లో నాలుగైదు టేబుల్‌స్పూన్ల నెయ్యి వేడి చేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వేయించిన ఉల్లిపాయలను ఒక ప్లేట్‌లోకి తీసుకుని, అందులో ముప్పావు వంతు చికెన్ గ్రేవీ కోసం, మిగిలిన పావు వంతు బిర్యానీ లేయరింగ్ కోసం పక్కన పెట్టుకోవాలి.

4 / 5
అదే నెయ్యిలో కొద్దిగా మసాలా దినుసులు వేసి వేయించాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్‌ను వేసి రెండు నిమిషాలు హై ఫ్లేమ్‌లో వేయించాలి. మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. చికెన్ నుండి నీరు ఊరిన తర్వాత, ముందుగా వేయించిన ఉల్లిపాయలలో ముప్పావు వంతు వేసి బాగా కలపాలి. మూత పెట్టి చికెన్‌ను 80-90% ఉడికే వరకు మీడియం నుండి లో ఫ్లేమ్‌లో వండాలి. గ్రేవీ మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. మరో స్టవ్ పైన నానబెట్టిన బియ్యాన్ని 60-70% ఉడికేలా వండాలి. బియ్యం మెత్తగా కాకుండా, కొద్దిగా పలుకుగా ఉండాలి. ఉడికిన బియ్యాన్ని నీటి నుండి వేరు చేసి పక్కన పెట్టుకోవాలి.

5 / 5
దమ్ బిర్యానీ కోసం ఒక పెద్ద, మందపాటి గిన్నెను తీసుకోవాలి. గిన్నె అడుగున రెండు టీస్పూన్ల నెయ్యి రాసి, సగం ఉడికించిన బియ్యాన్ని ఒక పొరగా పరచాలి. దానిపై కొత్తిమీర, పుదీనా ఆకులు, వేయించిన ఉల్లిపాయలు, కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేయా. ఆపై ఉడికించిన చికెన్‌ను గ్రేవీతో సహా రెండవ పొరగా వేయాలి. మిగిలిన బియ్యాన్ని చికెన్ పైన మూడవ పొరగా వేసి, మిగిలిన వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, ఒకటి రెండు టీస్పూన్ల నెయ్యి, కుంకుమపువ్వు నీరు, అలాగే బియ్యం ఉడికించిన నీరు వేయాలి. ఇది బిర్యానీ మాడిపోకుండా దమ్ అవడానికి సహాయపడుతుంది.గిన్నెను అల్యూమినియం ఫాయిల్ లేదా తడిపి పిండితో గట్టిగా మూత పెట్టాలి. మొదట 2-3 నిమిషాలు హై ఫ్లేమ్‌లో, ఆ తర్వాత 10-12 నిమిషాలు లో ఫ్లేమ్‌లో దమ్ చేయాలి. మొత్తం 12-15 నిమిషాల దమ్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, మరో పది నిమిషాలు అలాగే వదిలేయాలి. అంతే బిర్యానీ రెడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us