
చికెన్ వంటకాల్లో అన్నింటికంటే ముఖ్యమైన ఘట్టం మ్యారినేషన్. ఒక పెద్ద బౌల్‌లో తాజా చికెన్ ముక్కలను తీసుకుని, అందులోపెరుగు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, ఇంకా కొద్దిగా మిరియాల పొడి వేయాలి. ఇక్కడ మెయిన్ ట్రిక్ ఏంటంటే, వేయించిన ఉల్లిపాయలని చేత్తో నలిపి వేయడం. ఇది చికెన్‌కి అద్భుతమైన రుచిని ఇస్తుంది.

వీటన్నింటినీ బాగా కలిపి కనీసం అరగంట సేపు పక్కన పెట్టేయండి. టైమ్ ఉంటే గంట సేపు ఉంచితే ముక్కకి మసాలా బాగా జ్యూసీగా తయారవుతుంది. తరువాత బాండీలో వెన్న కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి రెమ్మలను వేసి దోరగా వేయించాలి. ఆ వెల్లుల్లి వాసన వస్తుంటేనే ఆకలి వేసేస్తుంది

ఆ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసి సన్నని మంట మీద ఉడికించాలి. చికెన్ లోని నీరు బయటకు వచ్చి గ్రేవీలా తయారవుతుంది. ఆ గ్రేవీ మెల్లమెల్లగా చిక్కబడుతూ ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు చికెన్ అసలైన రంగు బయటపడుతుంది. మంట ఎక్కువగా పెడితే ముక్క గట్టిగా అయిపోతుంది. తక్కువ మంటపై ఉడికించడం వల్ల ముక్క వెన్నలా మెత్తబడుతుంది.

మూత పెట్టి ఉడికించినప్పుడు ఆ మసాలాల సువాసనలన్నీ చికెన్ లోపలికి వెళ్లి అదిరిపోయే రుచిని ఇస్తాయి. చికెన్ దాదాపు ఉడికిన తర్వాత ఆఖర్లో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర చల్లితే వేడివేడి బటర్ గార్లిక్ చికెన్ రెడీ! ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ చూస్తుంటే ఎప్పుడు తిందామా అనే ఆత్రుత పెరిగిపోతుంది.

చివరగా కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకున్న వేడివేడి బటర్ గార్లిక్ చికెన్! ఇది చూడటానికే కాదు, తింటే కూడా స్వర్గంలా ఉంటుంది. ముక్కను ఇలా తుంచగానే అలా విడిపోతుంది, అంత సాఫ్ట్‌గా ఉంటుంది. దీన్ని పుల్కాలో పెట్టుకుని తిన్నా లేదా రైస్‌తో కలిపి తిన్నా ఆ అనుభూతే వేరు.