
ఒకప్పుడు అంటే కేవలం డబ్బు ఉన్నవారి ఇంట్లో మాత్రమే ప్రిజ్‌లు ఉంటేవి.. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రిజ్ అనేది కామన్ అయిపోయింది. అయితే ఏళ్ల తరబడి వాడుతున్నా చాలా మందికి ప్రిజ్‌లోని కొన్ని ఫీచర్స్ గురించి తెలిదు. అవును ఫ్రిజ్‌లో ఉండే 1, 2, 3, 4, 5 నంబర్లు.. టెంపరేచర్‌ను సూచిస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి ఈ నంబర్లకు, డిగ్రీ సెల్సియస్‌కు ఎలాంటి సంబంధం లేదు. దీని గురించి సోషల్ మీడియాలో మొదలైన చర్చతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఫ్రిజ్ నంబర్ల అసలు అర్థం ఏమిటి?: ఫ్రిజ్ లోపల పైభాగంలో ఒక చిన్న డయల్ ఉంటుంది. దానిపై సాధారణంగా 1 నుండి 5 వరకు, కొన్ని మోడళ్లలో 1 నుండి 7 వరకు నంబర్లు ఉంటాయి. చాలా మంది1టూ5 వరకు నెంబర్స్‌ను సెంటిగ్రేడ్స్ అనుకుంటారు. కానీ ఇవి కూలింగ్ పవర్‌ను సూచిస్తాయి. అంటే నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే, ఫ్రిజ్‌లో చల్లదనం అంత ఎక్కువగా ఉంటుంది.1 వ నంబర్: తక్కువ కూలింగ్, 5 వ నంబర్ ఎక్కువ కూలింగ్ అంటే, మీరు డయల్‌ను 5 లో పెడితే ఫ్రిజ్ చాలా ఎక్కువగా చల్లగా ఉంటుందని అర్థం.

అయితే దీని గురించి తెలియకా చాలా మంది డయల్‌ను తక్కువ నంబర్‌లో పెట్టి, ఫ్రిజ్ ఎక్కువ చల్లగా ఉంటుందని అనుకుంటారు. దీని కారణంగా ఫ్రిజ్‌లో తగినంత చల్లదనం లేక అందులో ఉంచి పాలు, ఆహార పదార్థాలు త్వరగా పాడైపోతాయి. కూరగాయల తాజాదనం తగ్గిపోతుంది. మరోవైపు, ఫ్రిజ్‌ను ఎప్పుడూ ఎక్కువ నంబర్‌లో ఉంచడం వల్ల లోపల వెనుక భాగంలో విపరీతంగా మంచు పేరుకుపోయే ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు వచ్చే కొన్ని ప్రిజ్‌లలో ఇది వేరేలా ఉండవచ్చు. కాబట్టి మీ ఇంట్లోని ఫ్రిజ్ డయల్ ఎలా పనిచేస్తుందో ఒకసారి మాన్యువల్ చూసి తెలుసుకోవడం మంచిది.

ఫ్రిజ్ డయల్‌ను ఎలా సెట్ చేయాలి: మీ ఫ్రిజ్ డయల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం చాలా ఈజీ. ఇందుకోసం మీరు డయల్‌ను నెమ్మదిగా తిప్పుతూ ఫ్రిజ్ వెనుక ఉన్న కంప్రెసర్ శబ్దాన్ని గమనించండి. డయల్ నంబర్ పెంచుతున్నప్పుడు కంప్రెసర్ స్టార్ట్ అయితే, మీరు ఫ్రిజ్‌ను మరింత చల్లబరుస్తున్నారని అర్థం. ఒకవేళ కంప్రెసర్ ఆఫ్ అయితే, సెట్టింగ్ తక్కువ కూలింగ్ వైపు వెళ్తోందని అర్థం.

సరైన సెట్టింగ్: ఫ్రిజ్ సరైన కూలింగ్ సెట్టింగ్‌లో ఉండటం వల్ల ఆహారం ఎక్కువ కాలం తాజాగా ఉండటమే కాకుండా, కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది. తప్పుడు సెట్టింగ్ వల్ల విద్యుత్ వినియోగం పెరిగి, కంప్రెసర్‌పై అదనపు భారం పడుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో ఫ్రిజ్ ఉష్ణోగ్రతను సరిగ్గా నిర్వహించడం చాలా అవసరం. ఇన్నాళ్లూ ఫ్రిజ్ నంబర్లు అంటే ఉష్ణోగ్రత అనుకున్న అపోహ ఇప్పుడు తొలగిపోయింది. సోషల్ మీడియా పుణ్యమా అని ఇవి కూలింగ్ తీవ్రతను సూచిస్తాయని అందరికీ తెలిసింది. కాబట్టి, నెక్ట్స్ టైమ్ ఫ్రిజ్ నోబ్ తిప్పేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.