
నీటి పరీక్ష: మనం ఇంట్లొనే కొన్ని చిన్న చిట్కాలను ఉపయోగించి కల్తీ కుంకుమ పువ్వును ఈజీగా గుర్తించవచ్చు. ఇందులో ముందుగా నీటితో పరీక్ష.. ఇందుకోసం మీరు ఒక గ్లాస్‌లో కొన్ని వేడి నీరు తీసుకోండి.. అందులో మీ దగ్గర ఉన్న కుంకుమ పువ్వును వేయండి.. వెంటనే ఆ నీరు రంగులోకి మారితే.. అది నకిలీ కుంకుమ పువ్వు అని అర్థం. ఎందుకంటే అసలైన కుంకుమ పువ్వు త్వరగా రంగు మారదు.. అది నీటిలో నానడానికి సమయం పడుతుంది. ఆ తర్వాత అది పసుపు రంగును రిలీజ్ చేస్తుంది.

రుచి పరీక్ష : మీరు టేస్ట్ ద్వారా కూడా కుంకుమ పువ్వు నకిలీదా.. అసలైందా గుర్తించవచ్చు. అసలైన కుంకుమపువ్వు రుచి చేదుగా, కాస్త కారంగా ఉంటుంది. నాలుకపై వేసుకున్నప్పుడు తీపిగా అనిపించినా లేదా అసలు రుచే లేకపోయినా అది నకిలీదని అర్థం. అలాగే నాలుకపై ఉంచగానే రంగు వదిలినా అది నకిలీదే అని తెలుసుకోండి.

చేతితో నలపడం: మనం చేతితో నలపడం ద్వారా కూడా కుంకుమ పువ్వు అసలైందా కాదా అని తెలుసుకోవచ్చు. ఇందుకోసం కుంకుమపువ్వు రేకును వేళ్ల మధ్య ఉంచి కొద్దిగా నలపండి. అసలైనది చాలా మెత్తగా ఉండి, నలపగానే సులభంగా ముక్కలైపోతుంది. ఒక వేళ మీరు నలిపే పువ్వు కాస్త గట్టిగా అనిపించినా.. త్వరగా విరగక పోయినా.. అది నకిలీ కుంకుమ పువ్వు అని అర్థం. అలాంటి వాటిని అస్సలు వాడకండి

గోరువెచ్చని పాలు : పాలతో కూడా కుంకుమ పువ్వు అసలైందా కాదా అనేది గుర్తించవ్చు. ఇందుకోసం గోరువెచ్చని పాలలో మీ దగ్గర ఉన్న కుంకుమపువ్వు వేయండి. మీ దగ్గర ఉన్న అసలైన కుంకుమ పువ్వే అయితే.. అది వెంటనే పాలల్లో పూర్తిగా కరిగిపోయి మంచి సువాసన, రంగును ఇస్తుంది. నకిలీది అయితే కరగకుండా దారాల్లాగే మిగిలిపోతుంది.

బేకింగ్ సోడా పరీక్ష: ఈ పద్దతిలో కుంకుమ పువ్వు నకిలీదా కాదా అని తెలుసుకోవడానికి.. ఒక గ్లాసు నీటిలో చిటికెడు బేకింగ్ సోడా వేసి, అందులో కుంకుమపువ్వు రేకను వేయండి. మిశ్రమం పసుపు రంగులోకి మారితే అది అసలైనది అని అర్థం. ఒకవేళ నీరు ఎరుపు రంగులోకి మారితే అది నకిలీది అని అర్థం. ఈ చిన్న ఇంటి పరీక్షల ద్వారా మీరు ఈజీగా అసలైన కుంకుమ పువ్వును గుర్తించవచ్చు.