రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం.. నోటికి రుచినిచ్చే అద్భుతమైన వంటకం

Updated on: Oct 14, 2026 | 10:15 PM

రాయలసీమ వంటకాలలో వెల్లుల్లి కారం ఒక ముఖ్యమైన వంటకం. ఇది రుచిలో తిరుగులేనిది. ఇంకా ఇది నోటికి రుచి తెలియకపోయినా, ఏదైనా రుచికరంగా తినాలనిపించినా ఈ ఎల్లిపాయ కారం సరైన ఎంపిక. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని, ఈ కారం కలుపుకుని తింటే కలిగే రుచి అనుభూతి అద్భుతం. కేవలం అన్నంతోనే కాకుండా, ఇడ్లీ, దోస, చపాతీ, పూరీ వంటి వివిధ రకాల టిఫిన్స్‌లకు కూడా ఇది అద్భుతమైన కాంబినేషన్‌. ఈ కారం సులువుగా తయారు చేసుకోవచ్చు. దీన్ని నిల్వ కూడా ఎక్కువ కాలం చేయవచ్చు.

1 / 5

2 / 5
కావాల్సిన పదార్దాలు : ఎండుమిర్చి – 50 గ్రాములు, ధనియాలు – 2 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర – 1 టీస్పూన్, ఎల్లిపాయ గడ్డలు (వెల్లుల్లి) – 5 (రెబ్బలుగా విడదీసి, పొట్టు తీయకుండా), ఉప్పు – రుచికి సరిపడా, నూనె – వేయించడానికి మరియు పోపుకు సరిపడా ,  ఆవాలు – 1 టీస్పూన్ (పోపు కోసం) కరివేపాకు – కొద్దిగా తీసుకోవాలి.

3 / 5
ముందుగా ఒక పాన్‌ను పొయ్యి మీద పెట్టి, మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత యాభై గ్రాముల ఎండుమిర్చిని అందులో వేయాలి. మంటను పూర్తిగా తగ్గించి, మిర్చి మాడిపోకుండా, దోరగా అయ్యే వరకు జాగ్రత్తగా వేయించుకోవాలి. మిర్చి రంగు మారిన తర్వాత, వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.

4 / 5
మిర్చి వేయించిన అదే నూనెలో రెండు టేబుల్‌స్పూన్ల ధనియాలు, ఒక టీస్పూన్ జీలకర్ర వేయాలి. వీటిని కూడా మాడిపోకుండా, సువాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత, అదే ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని, మనం వేయించి చల్లార్చుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేయాలి. ముందుగా వీటిని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, కొంచెం పలుకుగా ఉండేలా చూసుకోవాలి.

5 / 5
 గ్రైండ్ చేసిన పొడిలో ఐదు ఎల్లిపాయ గడ్డల రెబ్బలను (పొట్టు తీయకుండానే) రుచికి తగినంత ఉప్పు వేయాలి. మళ్లీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈసారి కూడా మరీ మెత్తగా కాకుండా, బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో ఐదు స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా కాగిన తర్వాత, ఒక టీస్పూన్ ఆవాలు, ఒక టీస్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఈ పోపును మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారంలో వేసి బాగా కలుపుకోవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us