పచ్చి బొప్పాయి vs పండిన బొప్పాయి.. ఆరోగ్యానికి ఏది మంచిది..? ఇవి పక్కా తెలుసుకోండి..

Updated on: Sep 27, 2026 | 5:19 PM

భోజనం తర్వాత లేదా అల్పాహారంలో పండ్లు తీసుకోవడం మన పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయం. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, షుగర్ ఉన్నవారు మాత్రం తాము తినే పండ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా బొప్పాయి పండును షుగర్ ఉన్నవారు తినొచ్చా? ఇది తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయా? పచ్చి బొప్పాయి మేలా లేక పండినది మంచిదా? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5
ఒక ఆహార పదార్థం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎంత వేగంగా పెంచుతుందో నిర్ధారించేదే గ్లైసెమిక్ ఇండెక్స్. పచ్చి బొప్పాయితో పోలిస్తే పండిన బొప్పాయికి జీఐ ఎక్కువ ఉంటుంది. పచ్చి బొప్పాయిలో క్లిష్టమైన పిండి పదార్థాలు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రక్తంలోకి చక్కెర చాలా నెమ్మదిగా విడుదలవుతుంది. అయితే బొప్పాయి పక్వానికి వచ్చే కొద్దీ దానిలోని సహజ చక్కెరల పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల బాగా పండిన పండు తిన్నప్పుడు చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే ముప్పు ఉంటుంది.

2 / 5
జీర్ణక్రియ వేగం కూడా రక్తంలో షుగర్ స్థాయిలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పచ్చి బొప్పాయిలోని గట్టి పీచు పదార్థాలు జీర్ణం కావడానికి శరీరం ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీనివల్ల గ్లూకోజ్ రక్తంలోకి ఒకేసారి కాకుండా క్రమంగా చేరుతుంది. అదే పండిన బొప్పాయి విషయానికి వస్తే అది మెత్తగా మారిపోవడం వల్ల వేగంగా జీర్ణమై దానిలోని గ్లూకోజ్ నేరుగా రక్తంలో కలిసిపోతుంది. అందుకే రక్తంలో చక్కెరను సమతుల్యంగా ఉంచుకోవాలనుకునే వారికి పచ్చి బొప్పాయే అత్యంత సురక్షితమైన ఎంపికగా నిలుస్తుంది.

3 / 5
పచ్చి బొప్పాయిలో పాపైన్ అనే అద్భుతమైన జీర్ణక్రియ ఎంజైమ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని అంతర్గత వాపును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా టైప్-2 మధుమేహంలో ఇన్సులిన్ నిరోధకత పెరగడానికి ఈ శరీర వాపే ప్రధాన కారణం. పచ్చి బొప్పాయిని తీసుకోవడం వల్ల పాపైన్ ప్రభావవంతంగా పనిచేసి ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. బొప్పాయి పూర్తిగా పండే క్రమంలో ఈ ఎంజైమ్ శాతం గణనీయంగా తగ్గిపోతుంది.

4 / 5
టైప్-2 మధుమేహాన్ని నియంత్రించడంలో బరువును అదుపులో ఉంచుకోవడం అత్యంత ముఖ్యం. పచ్చి బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువగా ఉండటమే కాకుండా పెక్టిన్ అనే ప్రత్యేక కరిగే ఫైబర్ ఉంటుంది. ఈ పెక్టిన్ పొట్టలోకి చేరినప్పుడు జెల్ మాదిరిగా మారి గ్లూకోజ్, కొవ్వులను తనలో బంధించి అవి రక్తంలోకి త్వరగా శోషించబడకుండా నెమ్మదింపజేస్తుంది. బొప్పాయి పండే కొద్దీ ఈ పెక్టిన్ కరిగిపోతుంది కాబట్టి పండిన పండుకు చక్కెరను నిరోధించే సామర్థ్యం తగ్గిపోతుంది.

5 / 5
మధుమేహ బాధితులు పచ్చి బొప్పాయిని సలాడ్, తురుము లేదా కూరల రూపంలో రోజువారీ ఆహారంలో నిరభ్యంతరంగా చేర్చుకోవచ్చు. ఒకవేళ తీపిగా ఉండే పండిన బొప్పాయి తినాలనిపిస్తే మాత్రం పరిమాణాన్ని కచ్చితంగా పరిమితం చేసుకోవాలి. ఒకేసారి కాకుండా తక్కువ మోతాదులో అది కూడా ప్రొటీన్ లేదా ఇతర ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహారంతో కలిపి తీసుకుంటే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. సరైన అవగాహనతో బొప్పాయిని ఎంచుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది సంపూర్ణ ఔషధంగా పనిచేస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us