పచ్చి మామిడికాయ రసం ఇలా చేసి తింటే.. వేసవిలో కూల్ కూల్ రిఫ్రెష్ రెసిపీ

Updated on: Apr 10, 2026 | 9:24 PM

Raw mango rasam recipe in telugu: పచ్చి మామిడికాయ రసం వేసవిలో తింటే రుచిగా ఉంటుంది. ఇది పుల్లపుల్లగా అన్నంలోకి అదిరిపోతోంది. అయితే, ఈ పచ్చి మామిడికాయ ముక్కలను ఉడకబెట్టి కందిపప్పుతో వండాలి. దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

కావలసిన పదార్థాలు: పచ్చి మామిడికాయ, ఒక కప్పు కందిపప్పు,  నాలుగు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, 
కారం, పసుపు, పావు కిలో బెల్లం ముక్క తీసుకోవాలి.

కావలసిన పదార్థాలు: పచ్చి మామిడికాయ, ఒక కప్పు కందిపప్పు, నాలుగు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు, పావు కిలో బెల్లం ముక్క తీసుకోవాలి.

2 / 5
పోపు ఇలా పెట్టుకోవాలి: పోపు  కోసం రెండు టేబుల్ స్పూన నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, ఐదు వెల్లుల్లి రెబ్బలు, ఇంగువను తీసుకోవాలి.

3 / 5
మామిడికాయలను ఉడికించుకోవాలి : ముందుగా మామిడికాయ ముక్కలు, రెండు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, నీళ్లు కలిపి బాగా మెత్తగా ఉడికించాలి. ఉడికిన మామిడికాయ ముక్కలను తీసుకుని మెత్తగా చేసుకుని దానిలో తగినన్ని నీళ్లు పోసుకోవాలి.

4 / 5
మరగబెట్టడం: ఒక కప్పు బెల్లం, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ఆ రాసాన్ని 15 నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచి వాటిని బాగా మరగనివ్వాలి.

5 / 5

మళ్ళీ కొత్తగా పాన్ తీసుకుని దానిలో అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర,  రెండు ఎండుమిర్చి,  మూడు వెల్లుల్లి, కరివేపాకు, కొద్దిగా ఇంగువను వేసి మంచిగా పోపు పెట్టాలి. ఈ పోపును చారులో వేసుకోవాలి.  చివర్లో కొత్తిమీరను తీసుకుని వేడి వేడి అన్నంతో కలుపుకుని తినాలి.

Follow Us