
రాగి పిండి డ్రింక్ రెసిపీ కావాల్సిన పదార్థాలు : రెండు టేబుల్ స్పూన్స్ రాగి పిండి, ఒక కప్పు నీరు, ఒక కప్పు పాలు , రెండు టేబుల్ స్పూనన్స్ బెల్లం పొడి, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అర టేబుల్ స్పూన్ నెయ్యి, ఇంకా 10 జీడిపప్పు, 10 బాదం పప్పులు తీసుకోవాలి.

రాగి పిండి డ్రింక్ రెసిపీ తయారీ విధానం : మీరు ముందుగా ఒక గినెలో కొద్దిగా రాగి పిండిని తీసుకుని దానిలో నీరు వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇక ఇప్పుడు మళ్ళీ ఇంకో పాత్ర తీసుకుని దానిలో నీరు కొద్దిగా పోసి మరిగించాలి. ఈ నీరు బాగా మరిగిన తర్వాత రాగి పిండిని కొంచం కొంచం పోస్తూ దీనిని కలుపుకోవాలి.

రాగి పిండి డ్రింక్ రెసిపీ తయారీ విధానం స్టెప్ 1 : ఇక ఇప్పుడు దీనిని మంటపై 10 నిముషాల పాటు ఉంచి ఈ పిండి బాగా ఉడికేలా చేయాలి. ఇక ఇప్పుడు దీనిలో పాలు కొంచం వేసి అలాగే 3 నిమిషాల పాటు దీనిని బాగా మరిగించాలి. ఇంకా స్టౌ ఆఫ్ చేసి దీనిలో బెల్లం పొడి కూడా వేసి పూర్తిగా కరిగే వరకు పొయ్యి మీదే ఉంచాలి

రాగి పిండి డ్రింక్ రెసిపీ తయారీ విధానం స్టెప్ 2 : ఇక చివర్లో దీనిలో కొద్దిగా యాలకుల పొడి, నెయ్యి కూడా వేసి మంచిగా కలపాలి. మీకు ఇంకా టేస్ట్ కావాలంటే 10 జీడిపప్పు, 10 బాదం పప్పులు కూడా దీనిలో వేసి సర్వ్ చేయాలి. దీనిని వేడి వేడిగా తాగితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)