
ఎండ దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు ఇలాంటి సమయంలో శరీరం చల్లగా ఉండాలి. ఎండలో బయటకు వచ్చి ఇది తాగితే బాడీకి శక్తి కూడా అందుతుంది అలాంటి సంప్రదాయ ఆరోగ్యకరమైన డ్రింక్ రాగి అంబలి మజ్జిగ. పల్లెటూర్లలో ఇప్పటికీ ఎంతో మంది ఈ నేచురల్ ఎనర్జీ డ్రింక్ తాగుతున్నారు. మరి, దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

రాగి అంబలి మజ్జిగ రెసిపీ కావాల్సిన పదార్థాలు: నాలుగు టేబుల్ స్పూన్స్ రాగి పిండి, రెండు గ్లాసులు నీరు, ఒక గ్లాస్ మజ్జిగ, రుచికి సరిపడా ఉప్పు , ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు , నాలుగు పచ్చిమిర్చి ముక్కలు, నాలుగు కరివేపాకు ఆకులు, కొద్దిగా కొత్తిమీరను తీసుకోవాలి. దీనిని పాత రోజుల్లో ఎంతో మంది తాగేవాళ్ళు

రాగి అంబలి మజ్జిగ తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకుని దానిలో కొద్దిగా నీళ్ళు పోసి దానిని ఉండలు లేకుండా దీనిని బాగా కలపాలి. అలాగే, ఒక పాత్ర తీసుకుని దానిలో నీటిని బాగా మరిగించి ఆ తరవాత దానిలో రాగి మిశ్రమాన్ని కొద్దీ కొద్దిగా పోస్తూ దీనిని కలుపుతూ ఉండాలి. అయితే, దీనిని బాగా ఉడికించి చిక్కగా వచ్చే కలుపుకోవాలి.

రాగి అంబలి మజ్జిగ తయారీ విధానం 2 : ఇది బాగా ఉడికిన తర్వాత దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ ఇది బాగా చల్లారిన తరవాత రాగి అంబలిలో మజ్జిగ, ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా దీనిలో వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. ఆ తరవాత దీనిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, కరివేపాకు ఆకులు , ఇంకా కొత్తిమీర కూడా వేసి కలపాలి. అంతే, రాగి అంబలి మజ్జిగ రెడీ.

ఈ రాగి మజ్జిగ తాగితే శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇంకా సమ్మర్లో డీహైడ్రేషన్ ను కూడా తగ్గిస్తుంది. ఇంకా కాల్షియం పుష్కలంగా ఉండి ఎముకలను కూడా ఇది బలంగా ఉంచుతుంది. ఇంకా జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరస్తుంది. ఇంకా ఎక్కువసేపు ఆకలి కాకుండా చూసుకుంటుంది. ఇంకా ఇది ఆకలిని కూడా నియంత్రిస్తుంది.