అన్నంతో అదిరిపోయే రెసిపీ.. 5 నిముషాల్లోనే ఈజీగా చూసేయోచ్చు

Updated on: Oct 17, 2026 | 8:25 PM

ఏం కూర చేయాలో తోచనప్పుడు, ఇంకా కూరగాయలు అందుబాటులో లేనప్పుడు, కేవలం ఐదే ఐదు నిమిషాల్లో ఈ టమాటా రైస్ ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలో తయారుచేయబడే ఈ రుచికరమైన టమాటా రైస్ పిల్లలకు లంచ్ బాక్సులకు, పెద్దలకు ఆఫీసులకూ కూడా మంచి ఎంపిక. దీనిని పెరుగు చట్నీతో లేదా నేరుగా కూడా తినొచ్చు

1 / 5

2 / 5
ముందుగా, ఒక గ్లాసు బియ్యాన్ని శుభ్రంగా కడిగి, అన్నం వండుకోవాలి. అన్నం మెత్తగా కాకుండా, పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి. వండిన అన్నాన్ని ఒక ప్లేట్‌లో వేసి చల్లార్చాలి. అన్నం పొడిపొడిగా ఉంటేనే టమాటా రైస్ రుచిగా ఉంటుంది. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి, అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, పావు టీ స్పూన్ సోంపు వేసి మంచి రంగు వచ్చేవరకు వేయించాలి. ఇక్కడ జీలకర్ర బదులుగా సోంపు వాడండి.

3 / 5
పోపు దినుసులు వేగిన తర్వాత, సన్నగా, పొడవుగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన రెండు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు సగం వేగితే సరిపోతుంది. ఇప్పుడు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయేవరకు బాగా వేయించాలి.

4 / 5
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత, పావు టీ స్పూన్ పసుపు పొడి, అర టీ స్పూన్ కారం పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. మసాలాలు కలిపిన తర్వాత, తరిగిన పెద్ద టమాటాలు మూడు లేదా చిన్నవైతే నాలుగు ముక్కలుగా చేసి వేయాలి. ఇప్పుడు రైస్‌కు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి.

5 / 5
దీనివల్ల టమాటాలు త్వరగా మగ్గుతాయి. టమాటాలు సగం మగ్గితే సరిపోతుంది. ఈ వంటకంలో పుదీనా, బిర్యానీ ఆకు వంటివి వాడకుండానే చాలా రుచిగా ఉంటుంది. టమాటాలు మగ్గిన తర్వాత, ముందుగా వండి చల్లార్చిన అన్నాన్ని వేసి, పోపు మిశ్రమంతో బాగా కలుపుకోవాలి. అన్నం అంతా మసాలా మిశ్రమంతో కలిసిపోయేలా చూసుకోవాలి.  అన్నం బాగా కలిపిన తర్వాత, రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరతో వేస్తే మంచిగా ఉంటుంది. ఈ టమాటా రైస్ చాలా తక్కువ సమయంలో, అద్భుతమైన రుచితోరెడీ అవుతుంది. ఇంకా పిల్లలకు లంచ్ బాక్సులకు ఇది చాలా నచ్చుతుంది. పెరుగు చట్నీతో కానీ దీనిని నేరుగా కూడా దీనిని తినొచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us