
పోషకాల ఖజానా - గుమ్మడి గింజలు: గుమ్మడి గింజలను న్యూట్రిషన్ పవర్‌హౌస్ అని చెప్పొచ్చు. వీటిలో బాడీకి కావాల్సిన ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, జింక్, ఐరన్ లాంటి ముఖ్యమైన న్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలోని ఫైబర్ పొట్టను ఎక్కువసేపు ఫుల్‌గా ఉన్న భావనను ఇస్తుంది. దీనివల్ల పదే పదే జంక్ ఫుడ్ లేదా స్నాక్స్ తినే అలవాటుకు చాలా ఈజీగా చెక్ పెట్టవచ్చు.

చియా సీడ్స్: చియా సీడ్స్ చిన్నవిగా ఉన్నా.. వీటిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. వీటిలో ఫైబర్, ప్రొటీన్‌తో పాటు బాడీకి ఎంతో మేలు చేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, అలాగే హార్ట్ చాలా హెల్తీగా ఉండాలని కోరుకునే వారికి సియా సీడ్స్ ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

అసలు మేజిక్: గుమ్మడి, చియా గింజలు రెండింటిలోనూ ప్రొటీన్, ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. ఈ రెండూ బరువు తగ్గించే ప్రాసెస్ లో వేర్వేరుగా సహాయపడతాయి. ఫైబర్ మనల్ని అతిగా ఆహారం తినకుండా ఆపి, క్యాలరీలను కంట్రోల్ చేస్తుంది.ప్రొటీన్ మన బాడీ జీవక్రియను బూస్ట్ చేసి, రోజంతా మనల్ని ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఈ రెండింటిలో మీకు నచ్చిన దానిని లేదా రెండింటినీ కలిపి డైట్‌లో పార్ట్ చేసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి.

వీటిని డైట్‌లో ఎలా తీసుకోవాలో తెలుసా?: ఈ గింజలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా అంటే చాలా సింపుల్. గుమ్మడి గింజలను నార్మల్‌గా నేరుగా నమిలేయవచ్చు లేదా లైట్‌గా వేయించుకుని ఈవినింగ్ టైమ్‌లో స్నాక్‌లా తినవచ్చు. చియా సీడ్స్‌ను రాత్రి పూట నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే కొద్దిగా నిమ్మరసం కలిపి తాగేయొచ్చు. లేదా మీరు రోజువారీ తాగే స్మూతీస్, ఫ్రూట్ జ్యూస్‌లు లేదా ఓట్‌మీల్‌లో మిక్స్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.

గ్యాస్ సమస్యలకు గుడ్ బై: ఈ విత్తనాలు కేవలం బరువు తగ్గించడానికే కాకుండా.. పొట్టకు సంబంధించిన అనేక రకాల సమస్యలకు చెక్ పెడతాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్, అజీర్తి, మలబద్ధకం, కడుపునొప్పి లాంటి సమస్యలన్నింటినీ తగ్గిస్తాయి. అంతేకాకుండా వీటిలో ఉండే ఒమేగా 3 వల్ల బ్రెయిన్ షార్ప్‌గా పనిచేయడంతో పాటు గుండె పదిలంగా ఉంటుంది.