
కావాల్సిన పదార్థాలు : శనగ పప్పు, పాలకూర రెండు కట్టలు తాజాగా ఉండేది, పచ్చి మిర్చి, అల్లం, జీలకర్ర , ఇంగువ, పసుపు, ఉప్పు, నూనె, వెల్లుల్లి రెబ్బలు.

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా పాలకూర తీసుకోవాలి. ఆకులను చిన్నగా కట్ చేసుకోని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత శనగపప్పు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. రేపు ఉదయం దోసెలు వేస్తాం అనుకుంటే, ఈ రోజు రాత్రి శనగపప్పులను నానబెట్టాలి.

తర్వాత రోజు ఉదయం శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూర, శనగపప్పు, అల్లం , జీలకర్ర, ఇంగువ, పచ్చి మిర్చీ అన్నీ వేసి కొన్ని నీళ్లు పోసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అచ్చం దోసె పిండి మాదిరి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరు, ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి.

తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి, దోసె పాన్ పెట్టాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పిండితో దోసెలు వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ప్రోటీన్ పుష్కలంగా ఉండే శనగపప్పు, పాలకూర దోసెలు రెడీ. మరి మీరు కూడా ఒకాసారి ట్రై చేయండి.

ఈ దోసె చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఉదయాన్నే పిల్లలకు ఈ టిఫిన్ పెట్టడం వలన వారు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఇది వారి ఎదుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు