
ఈ మద్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ బ్యూటీకి సంబంధించిన అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రియా శెట్టికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. అది ఏమిటంటే? హౌజ్‌లో కామనర్‌గా అడుగు పెట్టిన ప్రియా శెట్టి ఓ సినిమాకు ఆడిషన్ ఇవ్వడమే కాకుండా, ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందంట. కానీ చివరి నిమిషంలో ఆ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకుందంట. ఇంతకీ ఆ హీరో ఎవరంటే.

టాలీవుడ్ స్టార్ , రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన పెళ్లి చూపులు మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకొని, అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ టాలీవుడ్ స్టార్ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే విజయ్ చాలా సినిమాలు చేసిన విషయం తెలిసిందే, అందులో కొన్ని హిట్స్ అందుకుంటే మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయితే ఆయన నటించిన సినిమాల్లో డియర్ కామ్రేడ్ మూవీ ఒకటి.

ఈ మూవీలో నటించేందుకు ప్రియాశెట్టి ఛాన్స్ కొట్టేసిందంట. విజయ్ దేవరకొండకు చెల్లి పాత్రలో నటించే అవకాశం వచ్చిందంట. దీంతో ఈ బ్యూటీ కొన్ని రోజుల పాటు ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నదంట. అయితే ఈమె సినిమాలో చేస్తున్న విషయం తమ తల్లిదండ్రులకు చెప్పలేదంట.

ఒకరోజు ఈ విషయం తెలుసుకున్న వారు, షూటింగ్ వద్దూ.. ఏం వద్దూ అంటూ తనను షూటింగ్ స్పాట్ నుంచి ఇంటికి తీసుకెళ్లారంట. చిత్ర యూనిట్ బాగా చేస్తుంది, సిస్టర్ లా చూసుకుంటాం అని చెప్పినా కూడా ప్రియా వాళ్ల పేరెంట్స్ తనను షూటింగ్‌కు పంపలేదంట.అలా డియర్ కామ్రేడ్ మూవీలో అవకాశాన్ని మిస్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఇక ప్రియాకు సినిమాలంటే చాలా ఇష్టం అంట. సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్‌తో ఈ బ్యూటీ బిగ్ బాస్ అగ్నిపరీక్షలోకి వెళ్లి, తన ఆటతీరు, మాటతీరుతో ఆడియన్స్‌ను మెప్పించి హౌజ్‌లోకి అడుగు పెట్టింది. కానీ తన మాటతీరుతో ఈ బ్యూటీ హౌజ్‌లోకి వెళ్లిన తర్వాత చాలా నెగిటివిటీ మూటగట్టుకుంటుంది.