ఈ జంతువులు కానీ బ్రతికుంటే.. మనిషి ఉండేవాడే కాదట.. భూమ్మీదే అత్యంత భయంకరమైన 5 జీవులు!

Updated on: Aug 18, 2026 | 9:02 PM

ఈ మొత్తం విశ్వంలో మన భూగ్రహం మీద మాత్రమే జీవులున్నాయనేది నేటికి కాదనలేని సత్యం.. అయితే కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఓ మండే అగ్నిగోళంగా మారి చల్లబడిన తర్వాత జీవం పుట్టుకకు అనువైన వాతావరణం ఏర్పడినట్టు ఖగోళ శాస్త్రాలు చెబుతున్నాయి. అలా మొదలైన జీవులు పరిణామ క్రమం నేటి మానవుల వరకు చేరింది. ఇప్పుడే ఆ మానవుడే విశ్వాన్ని ఏలే స్థాయికి చేశాడు. కాని ఒక్కప్పుడు మనిషిని మించిన కొన్ని జీవాలు ఈ భూమిని ఏలాయని.. ఒక వేళ అవే జీవులు కనుక బ్రతికి ఉంటే ఈ భూమిపై మానవులు మనుగడ కష్టంగానే మారేదని నిపుణులు చెబుతున్నారు. థింక్ డీప్‌ ఎక్స్ యూట్యూబ్ చానల్‌ చెప్పిన ప్రకారం.. ఒకప్పుడు భూమిని ఏలిన అత్యంత ప్రమాదకరమైన జీవుల గురించి తెలుసుకుందాం.

1 / 5
స్మైలోడాన్: ఈ సేబర్ టూత్ టైగర్ ఏడు అంగుళాల పొడవైన దంతాలతో భయంకరంగా ఉండేది. డైనోసార్లు అంతరించిన తర్వాత ఇవి భూమిని ఆక్రమించాయి. ఇవి మానవులతో సహవాసం చేశాయని పరిశోధనలు చెబుతున్నాయి. మంచు యుగం ముగిసే కాలంలో మానవుల వేట కారణంగా ఇవి అంతరించిపోయాయి. ప్రస్తుత సింహం కంటే ఎంతో శక్తివంతమైనవిగా వీటిని పరిగణిస్తారు.

2 / 5
జిగాంటోపెతికస్ : ఇది కింగ్ కాంగ్ పాత్రకు ప్రేరణగా నిలిచిన ఈ జీవి. ఇది లోకంలోనే అతిపెద్ద వానర జాతికి చెందినవట. సుమారు లక్ష సంవత్సరాల క్రితం మానవ జాతితో పాటు ఇవి నివసించాయట. గొరిల్లాల కంటే పెద్దదైన ఈ జీవులు మంచు యుగం ముగుస్తున్నప్పుడే అంతరించిపోయాయని తెలుస్తోది.

3 / 5
మెగా క్రొకడైల్: 1 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన ఈ భారీ మొసలి 30 అడుగుల పొడవు వరకు ఉండేదట. టి-రెక్స్ వంటి డైనోసార్ల కంటే కూడా ఆకారంలో ఇవి పెద్దదిగా ఉండేవని భావిస్తారు. డైనోసార్లు అంతరించాక ఆహారం దొరకక ఇవి కూడా కనుమరుగైపోయాయనట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించిన అస్తిపంజరాలు ఇంకా కొన్ని మ్యూజియాలలో భద్రంగా ఉన్నాయి.

4 / 5
టి-రెక్స్ : భూమిపై జీవించిన అత్యంత భయానక జీవులలో ఈ రాక్షస బలులు ఒకటి.. అందులో అప్రతి ప్రమాదకరమైనది ఈ టి-రెక్స్. తనకంటే పెద్దవైన డైనోసార్లను సైతం వేటాడి తినేది. దీని వేగం, బలం ముందు ఇతర జీవులు నిలవలేవు. దీనికి సహజ శత్రువులు ఉన్నప్పటికీ, దాని బలాన్ని మరే ఇతర జీవి బలాంతోనూ పోల్చలేరు.

5 / 5
ఈ జీవులన్నీ మనుషులు కనుగొన్న భారీ, భయానక, ప్రమాదకర జీవులు. ప్రకృతి సమతౌల్యాన్ని చూపించేందుకు ప్రతీ జీవికి సహజ శత్రువులుంటాయి. ఈ భయంకర జీవులు కూడా కాలగమనంలో, వాతావరణ పరిస్థితుల ప్రతికూలతల వల్ల, ఆహారం దొరకక లేదా ఇతర జాతులకు ఆహారమై అంతరించిపోయాయి. వాటి శిలాజ అవశేషాల ఆధారంగా శాస్త్రవేత్తలు వాటి గురిచి తెలుసుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us